Multiple Sclerosis | ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ ఉండే ఉద్యోగాలను చేయడం లేదు. నిత్యం గంటల తరబడి కూర్చుని ఉండే ఉద్యోగాలనే చేస్తున్నారు. కంప్యూటర్ల ఎదుట కూర్చుని గంటల తరబడి అదే తీరుగా పనిచేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరికి అర చేతులు, పాదాల్లో తాత్కాలికంగా స్పర్శ ఉండడం లేదు. అలాగే ఆయా భాగాల్లో సూదుల్తో గుచ్చినట్లు కూడా అనిపిస్తుంది. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇది తాత్కాలికమే అయినప్పటికీ దీర్ఘకాలంగా ఇది జరిగితే మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అలాగే చేతులు, పాదాల్లో స్పర్శ లేకపోవడానికి పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని మల్టిపుల్ స్లెరోసిస్ (ఎంఎస్) అంటారు. ఇది వస్తే మాత్రం కచ్చితంగా ఇందుకు మూల కారణం ఏంటో తెలుసుకుని చికిత్సను అందించాలి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది.
మల్టిపుల్ స్లెరోసిస్ అనే సమస్య కేవలం అర చేతులు, పాదాల్లోనే కాకుండా ముఖంపై లేదా ఇతర శరీర భాగాల్లోనూ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య గనక ఇతర భాగాల్లో ఉంటే అప్పుడు రోజువారీగా చేసే పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది. చేసే పనిపై ధ్యాస ఉండదు. ఏకాగ్రత నశిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మెదడు మొద్దు బారిపోయినట్లు అనిపిస్తుంది. యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే ఏవైనా వస్తువులను పట్టుకున్నా కూడా స్పర్శ సరిగ్గా తెలియదు కనుక ఆ వస్తువులు సులభంగా కిందపడుతుంటాయి. దీంతోపాటు సరిగ్గా నడవలేకపోతుంటారు. కంప్యూటర్ కీబోర్డుపై వేళ్లను సరిగ్గా కదిలించలేరు.డ్రైవింగ్ చేసేటప్పుడు ధ్యాస ఉండదు. వాహన స్టీరింగ్ లేదా బైక్‌పై అయితే హ్యాండిల్‌పై పట్టు కోల్పోతారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
కొందరికి మల్టిపుల్ స్లెరోసిస్ అనే సమస్య కేవలం తాత్కాలికంగా ఉంటుంది. ఉదాహరణకు కొందరు ఏదైనా తినేటప్పుడు లేదా తాగేటప్పుడు నాలుకను అకస్మాత్తుగా అనుకోకుండా దంతాలతో కొరుక్కుంటారు. ఇలా జరిగితే కొందరికి మల్టిపుల్ స్లెరోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ విధంగా ఈ సమస్య వస్తే అది తాత్కాలికంగానే ఉంటుంది. కంగారు పడాల్సిన పనిలేదు. కానీ ఇతర కారణాల వల్ల మల్టిపుల్ స్లెరోసిస్ వస్తే మాత్రం కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి, ఫెరిఫెరల్ న్యూరోపతీ ఉన్నవారికి, స్ట్రోక్స్ వచ్చిన వారికి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి, మెడ లేదా భుజాలు డ్యామేజ్ అయిన వారికి, కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ఉన్నవారికి మల్టిపుల్ స్లెరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.
మల్టిపుల్ స్లెరోసిస్ ఉన్నవారు డాక్టర్ ఇచ్చే మందులను క్రమం తప్పకుండా నిర్దిష్ట కాలం పాటు రోజూ వాడాలి. అలాగే రోజూ కచ్చితంగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేసినా శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో పాదాలు, చేతుల్లో స్పర్శ కోల్పోవడం అనే సమస్య తగ్గుతుంది. అలాగే కొందరు రోజూ బిగుతుగా ఉండే జీన్స్ లేదా ఇతర దుస్తులను ధరిస్తారు. వీటి వల్ల కూడా మల్టిపుల్ స్లెరోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక శరీరాన్ని పట్టి ఉంచే దుస్తులు కాకుండా వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. అలాగే రోజూ ప్రాణాయామం, యోగా వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి తప్పక బయట పడతారు. వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మనస్సు రిలాక్స్ అయ్యేలా చేసే పనులు చేయాలి. దీంతో మల్టిపుల్ స్లెరోసిస్ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.