Paneer | పనీర్.. రుచికరమైందే కాదు దీని వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాల (Milk)ను విరగొట్టడం ద్వారా తయారైన ఈ పనీర్ (Paneer)లో క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా నాన్వెజ్ తినని వాళ్లకి పనీర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. పనీర్ ఒక్కటి ఉంటే చాలు దాంతో నంబర్ఆఫ్ వెరైటీస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. పనీర్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్, కడాయ్ పనీర్, ఇక పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పనీర్ 65, పనీర్ టిక్కా వంటి అనేక వెరైటీలు ఎంతో రుచికరంగా చేసుకోవచ్చు.
అలాంటి పనీర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోనే బెస్ట్ ఛీజ్ ఫుడ్స్ (Best Cheese Dishes In The World)లో మన దేశం నుంచి పనీర్ ఏకంగా మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా ఏడు డిఫరెంట్ పనీర్ రెసిపీస్ టాప్ 50లో చోటు దక్కించుకోవడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పలువురు వంట నిపుణుల పర్యవేక్షణలో ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ (food guide Taste Atlas ) ఈ జాబితాను రూపొందించింది.
ఈ జాబితాలో స్విట్జర్లాండ్ ఛీజ్ వంటకం రాక్లెట్ (Raclette) అగ్రస్థానంలో నిలవగా.. గ్రీస్ వంటకం సంగనకీ (Saganaki) రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత మన దేశం నుంచి షాహీ పనీర్ (Shahi Paneer) మూడో స్థానం, పనీర్ టిక్కా (Paneer Tikka) నాలుగో స్థానంలో నిలిచింది. వీటితోపాటు మరికొన్ని పనీర్ వంటకాలు టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మట్టర్ పనీర్ (24వ స్థానం), పాలక్ పనీర్ (30), సాగ్ పనీర్ (31), కడాయ్ పనీర్ (40), పనీర్ మఖనీ (48) ఈ జాబితాలో నిలిచాయి.
Also Read..
Rishi Sunak | గర్వించదగ్గ రోజు.. సుధామూర్తి పద్మభూషణ్ అవార్డు అందుకోవడం పట్ల రిషి సునాక్
Girl Swallows Phone | సోదరుడితో గొడవ.. సెల్ఫోన్ మింగేసిన యువతి
UAE | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం.. యూఏఈ కోర్టు తీర్పు