e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News World Egg Day : గుండెకు మేలుచేసే గుడ్డు!

World Egg Day : గుండెకు మేలుచేసే గుడ్డు!

న్యూఢిల్లీ : రోజూ యాపిల్ తింటే డాక్ట‌ర్‌కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని చెబుతుంటారో రోజుకో గుడ్డు తింటే వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంద‌నే అపోహ‌తో ఎగ్‌ను తీసుకోని వారు ఎలాంటి భ‌యాలు లేకుండా తినవ‌చ్చ‌ని గుడ్డుతో బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. అక్టోబ‌ర్ 8 వ‌ర‌ల్డ్ ఎగ్ డే సంద‌ర్భంగా గుడ్డుతో ఆరోగ్యానికి క‌లిగే మేలు గురించి చూద్దాం..


గుండెకు భ‌రోసా : రోజూ గుడ్డు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పెరుగుతుంద‌ని ఇది గుండెకు మేలు చేకూరుస్తుంద‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. నిత్యం గుడ్డు తీసుకోవ‌డం ద్వారా ప‌లు గుండె సంబంధిత వ్యాధుల ముప్పును నివారించ‌వ‌చ్చ‌ని పేర్కొంది.

- Advertisement -


కంటి ఆరోగ్యం మెరుగు : వ‌య‌సు పెరిగే కొద్ది కంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. గుడ్డులో ఉండే లుటిన్‌, జెక్సాన్‌ధిన్ వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే యాంటీఆక్సిడెంట్ల‌ని నిపుణులు చెబుతున్నారు.

ప్రొటీన్ : గుడ్డులో ప్రొటీన్ పుష్క‌లంగా ఉండ‌టంతో శ‌రీర నిర్మాణం, ఎముక‌లు, కండ‌రాల పుష్టికి ఉప‌క‌రిస్తుంది. రోజువారీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప్రొటీన్‌ను ఎగ్ అందించ‌డం ద్వారా రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. ఇక గుడ్డు తీసుకోవ‌డం ద్వారా శ‌రీరంలో జీవ‌క్రియ‌లు వేగ‌వంత‌మై బ‌రువు త‌గ్గేందుకూ ఇది దారితీస్తుంది. శ‌రీరంలో క‌ణ‌జాలం ఆరోగ్యంగా ఉండేందుకు కీల‌క‌మైన పోష‌కం చోలైన్ గుడ్డులో అధికంగా ల‌భిస్తుంది. చోలైన్ శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌నూ మెరుగుప‌రుస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement