Health Tips | నెయ్యితో కొవ్వును కరిగించండిలా..!
Health Tips : మన పూర్వీకులు ఇష్టంగా ఆరగించిన నెయ్యిపై ఇప్పుడు మనలో చాలా మందికి అపోహలున్నాయి.
Health Tips : మన పూర్వీకులు ఇష్టంగా ఆరగించిన నెయ్యిపై ఇప్పుడు మనలో చాలా మందికి అపోహలున్నాయి. నెయ్యిలో కొవ్వు పదార్దాలు అధికంగా ఉంటాయని అందుకే నెయ్యికి దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే నెయ్యిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్, ఆరోగ్యకర కొవ్వులు మెండుగా ఉంటాయని తాజా అధ్యయనం పేర్కొంది. నెయ్యి ప్రయోజనాల గురించి ప్రశాంత్ దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంంది.
నెయ్యి ప్రపంచంలోనే ఉత్తమ ఫ్యాట్ అని ఈవీడియోలో చెప్పుకొచ్చారు. నెయ్యి కొవ్వును కరిగించే పదార్ధాలను కలిగిఉందని దేశాయ్ చెబుతున్నారు. మనం భగవంతుడికి అందించే ఏకైక కొవ్వు పదార్ధం నెయ్యి మాత్రమేనని వివరించారు. అందుకే నెయ్యి తరతరాల నుంచి మనుగడలో ఉంటూ వస్తోందని స్టాన్‌ఫర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన దేశాయ్ చెప్పుకొచ్చారు.నెయ్యితో హృద్రోగ ముప్పును నివారించడంతో పాటు మెదడు పనితీరు మెరుగవుతుందని, అధిక రక్తపోటునూ నియంత్రిస్తుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
శాస్త్ర పరంగా చూసినా నెయ్యిలో కొవ్వును కరిగించే అత్యంత శక్తివంతమైన కాంజుగేటెడ్ లైనోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) పుష్కలంగా ఉంటుందని ముంబైకి చెందిన కన్సల్టెంట్ క్లినికల్ డైటీషియన్ పూజా షా భవే చెప్పుకొచ్చారు. పాలు, వెన్న, నెయ్యి, నూనె గింజలు, మాంసంలో సహజంగా లభించే సీఎల్ఏ ఉంటుందని అన్నారు. ఆవు నెయ్యిలో సీఎల్ఏ మరింత అధికంగా ఉంటుందని చెప్పారు. అయితే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండే నెయ్యిని మితంగా తీసుకుంటేనే వాటి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read More :
Heatwave: మరో 4 రోజులు హీట్‌వేవ్: హైదరాబాద్ ఐఎండీ
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

