న్యూఢిల్లీ : చలికాలంలో కాలేయం ఆరోగ్యం (Healthy Liver) కాపాడుకోవాలంటే ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల ముంగిట కేక్స్, బర్గర్లు, పిజాల వంటి హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడంతో బరువు పెరగడం, కడుపుబ్బరం, వికారం, మలబద్ధకం వంటి రుగ్మతలకు దారితీయడంతో పాటు ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వంటి కాలేయ సమస్యల బారినపడకుండా చూసుకోవాలి.
మద్యం, చక్కెర, కొవ్వు పదార్ధాలను అతిగా తీసుకుంటే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పండగ సీజన్లో ఎక్కువమంది మద్యం, షుగర్, అనారోగ్యకర కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకునేందుకు మొగ్గుచూపుతుంటారని, ఇది కాలేయ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని నవిముంబైకి చెందిన కాలేయ మార్పిడి నిపుణులు డాక్టర్ విక్రం రౌత్ చెప్పారు. మద్యం తీసుకోవాలనుకునే వారు నెమ్మదిగా మద్యాన్ని సేవించాలని, మద్యం తీసుకునే ముందు దాహం తీర్చుకునేందుకు ఒకట్రెండు గ్లాసుల మంచినీరు తాగాలని ఆయన సూచిస్తున్నారు.
ఆరోగ్యకర కాలేయం ఒక డ్రింక్ మద్యాన్ని 60 నిమిషాల్లో ప్రాసెస్ చేయగలిగే సామర్ధ్యం ఉంటుందని, కాలేయ సమస్యలుంటే ఆల్కహాల్‌ను లివర్ ప్రాసెస్ చేసే సామర్ధ్యం మందకొడిగా ఉంటుందని డాక్టర్ రౌత్ చెప్పుకొచ్చారు. షుగర్‌తో కూడిన డ్రింక్స్‌ను ఆల్కహాల్‌తో కలిపి తీసుకోరాదని సూచించారు. రోజూ మద్యం సేవించే వారిలో హై కార్బోహైడ్రేట్ కంటెంట్‌తో బరువు పెరుగుతారు. మద్యం సేవించే ముందు గుడ్లు, ఫిష్, చికెన్, మాంసం, డైరీ ఉత్పత్తులు, పప్పుధాన్యాల వంటి ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో పాటు రోజూ వ్యాయామం చేయడం ద్వారా కాలేయ సామర్ధ్యాన్ని తగ్గించే కడుపులో కొవ్వును కరిగించవచ్చు. మద్యం సేవించడం ద్వారా శరీరం కోల్పోయే బీ విటమిన్లు, సీ విటమిన్, మెగ్నీషియం వంటి పోషకాలను తిరిగి శరీరం సంగ్రహించేలా చూసుకోవాలి.
Read More :
OG | అభిమానులు ఆకలితో ఉన్నారు.. పవన్ కల్యాణ్ ఓజీపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్