OG | అభిమానులు ఆకలితో ఉన్నారు.. పవన్ కల్యాణ్ ఓజీపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్
OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీగా మారిపోయాడు పవన్ కల్యాణ్. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సినిమాల షూటింగ్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడ్డది.
OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు, సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ (OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీగా మారిపోయాడు పవన్ కల్యాణ్. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో సినిమాల షూటింగ్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడ్డది.
అయితే వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ గురించి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. టైమ్‌లైన్ బర్త్ డే విషెస్‌తో నిండిపోయింది. అభిమానులు ఆకలితో ఉన్నారు. మీకు చెప్పాల్సింది ఏంటంటే.. ప్రస్తుతానికి మే షూటింగ్ చేయడం లేదు. కాబట్టి అప్డేట్స్ కోసం మరికొంత సమయం పడుతుంది.. అందుకే అప్పుడే వేచి చూడకండి.. అని ట్వీట్ చేశారు. ఈ లెక్కన పవన్ కల్యాణ్‌ను ఓజీగా సిల్వర్ స్క్రీన్‌పై చూడాలంటే మరింత సమయం పట్టనుందన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మరి.
ఇప్పటికే ఓజీ నుంచి HUNGRYCHEETAH అంటూ లాంఛ్ చేసిన గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. పవర్‌స్టార్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.
ఓజీలో పవన్ కల్యాణ్ ఓవైపు వారియర్‌గా.. మరోవైపు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఓజీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో కూడా నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
Timeline is filled with birthday wishes. 🫠🙄 Fans are Naturally Hungry. Just to let you know, we’re not shooting now, so it will take a little more time to get updates. Don’t stay tuned here.
— DVV Entertainment (@DVVMovies) December 12, 2023
ఓజీ గ్లింప్స్..
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

