ఆరోగ్యకరంగా సుదీర్ఘ కాలంపాటు బతికే వాళ్లు మనకు ఎక్కువగా ఐరోపా ఖండం మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో కనిపిస్తారు. ఈ ప్రాంతానికి సుదూరంలో ఉన్న ఆసియా ఖండపు దేశం జపాన్లో కూడా అత్యధిక జీవన ప్రమాణం ఉన్నవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉంటే… అధిక మోతాదులో మాంసం, ప్రాసెస్డ్ మాంసాహారం, గుడ్లు, మయోనీస్తో డ్రెసింగ్ చేసిన ఆహారం తీసుకునే పశ్చిమ దేశాల వారిని… కూరగాయలు, పండ్లు, సముద్ర ఆహారం, సోయా ఉత్పత్తులు ఎక్కువగా తీసుకునే జపాన్ వారితో పోలుస్తూ కాలిఫోర్నియా, హంగరీ, జపాన్ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు.
ఇందులో జపాన్ తరహా ఆహారం తీసుకున్నవారిలో వృద్ధాప్యం ఛాయలు తక్కువగా కనిపించాయట. మీ పళ్లెంలోనూ తాజా కూరగాయలు, పండ్లు, సముద్ర ఆహార వనరులు తగినపాళ్లలో ఉండేలా చూసుకోండి.