బుధవారం 20 జనవరి 2021
Health - Nov 30, 2020 , 18:47:17

వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..?

వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..?

హైద‌రాబాద్ : కొందరు వేడి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మంచిది కాదు.. చన్నీళ్లు చేయాలి అంటారు. ఇంకొందరు లేదు వేడి నీళ్లే మంచివని అంటుంటారు. రెండూ కాదు గోరు వెచ్చటి నీళ్లే అన్ని రకాలుగా మంచిదని మరికొందరు చెబుతుంటారు. ఇవన్నీ విని అనవసరంగా అయోమయంలో పడుతుంటారు చాలా మంది. ఏదేమైనప్పటికీ వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ హాయే వేరు కదా. ఒత్తిడి, ఒళ్లు నొప్పులు లాంటివన్నీ దెబ్బకి పారిపోవాల్సిందే. రోజూ వేడి నీళ్లతోనే స్నానం చేసేవారికి ఓ శుభవార్త. 

ప్రతిరోజూ వేడి నీళ్లతో స్నానం చేసే వారిలో గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప‌రిశోధ‌న‌లో తేలింది. జర్నల్ హార్ట్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం.. వారంలో ఒకటి, రెండు రోజులు మాత్ర‌మే వేడి నీళ్ల‌తో స్నానం చేసేవారిక‌న్నా ప్రతి రోజు వేడి నీటితో స్నానం చేసేవారిలో గుండెపోటు లాంటి సమస్యలు తక్కువగా వస్తున్నట్లు తెలిసింది. రోజు వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గి కార్డియోవాస్కులర్ డిసీజ్ రాకుండా ఉంటుంద‌ట‌. దీంతో పాటు ప్రశాంతగా నిద్రపోయి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా వేడి నీళ్లు బాగా సహకరిస్తాయని ప‌రిశోధ‌కులు గుర్తించారు. 

ఈ స్టడీలో భాగంగా.. దాదాపు 61 వేల మందికి పైగా ప్రజలను వారి స్నానపు అలవాట్టు, రోజువారి పనులు, వ్యాయామం, డైట్, మద్యపానం, బరువు, నిద్రపోయే సమయాలు, మెడికల్ హిస్టరీ, వాళ్లు వాడే మెడిసిన్ల గురించి ప‌లుర‌కాల ప్రశ్నలు వేశారు. వీరిని ఫిల్టర్ చేసి.. తిరిగి 30,076 మందిని వారి స్నానపు అలవాట్లపై స్టడీ చేశారు. దీంట్లో తెలిసిన విషయం ఏంటంటే.. వారానికి ఒకటి, రెండు సార్లు వేడి నీళ్ల స్నానం చేసే వారికంటే.. ప్రతి రోజూ వేడి నీళ్లు పోసుకునే వారిలో  గుండె సమస్యలు, ఆకస్మిక మరణం, లాంటివి వచ్చే అవకాశాలు 28 శాతం తక్కువగా ఉన్నాయట. 


logo