న్యూఢిల్లీ : కరోనా వైరస్ (Covid-19) మరోసారి వేగంగా ప్రబలుతోంది. 2023లో ఒక్కరోజులో అత్యధికంగా గత 24 గంటల్లో ఏకంగా 3824 కొవిడ్-19 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. హెచ్3ఎన్2 ఇన్ప్లుయంజా కేసులు వ్యాప్తి చెందడంతో భారత్‌లో గత కొద్దిరోజులుగా తాజా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
కొవిడ్-19 రికవరీ రేటు ప్రస్తుతం 98.77 శాతంగా ఉండటం కొంత ఊరట ఇస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కొవిడ్-19తో బాధపడుతూ గడిచిన 24 గంటల్లో ఢిల్లీ, హర్యానా, కేరళ, రాజస్ధాన్ రాష్ర్టాల నుంచి ఒక్కరేసి చొప్పున నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా కేసుల పెరుగుదలతో తమిళనాడు వంటి పలు రాష్ట్రాలు ఆస్పత్రుల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశాయి.
మరోవైపు కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల్లో కోరింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కొవిడ్-19 కట్టడికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లను వైద్యాధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కొవిడ్-19 న్యూ వేరియంట్లను పసిగట్టేందుకు అన్ని పాజిటివ్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు.
Read More
Taliban | అఫ్గాన్‌లో ముగ్గురు బ్రిటన్ జాతీయులను బంధించిన తాలిబన్లు