కాబూల్: అఫ్గానిస్థాన్లో (Afghanistan) బ్రిటన్కు చెందిన ముగ్గురు వ్యక్తులను (British men) తాలిబన్లు (Taliban) బంధించారు. వారిలో ఇద్దరు గత జనవరి నుంచి బంధీలుగా ఉండగా, మరొకరు ఎంతకాలం నుంచి ఉన్నారనే విషయం తెలియరాలేదని యూకేకు (UK) చెందిన నాన్ ప్రాఫిట్ గ్రూప్ ప్రెసీడియమ్ నెట్వర్క్ (Presidium Network) వెల్లడించింది. బందీలుగా ఉన్నవారిలో చారిటీ వైద్యుడైన 53 ఏండ్ల కెవిన్ కార్న్వెల్, యూట్యూబ్ స్టార్ మైల్స్ రౌట్లెడ్జ్ (YouTube star Miles Routledge), మరొకరి పేరు తెలియనప్పటికీ.. అతడు హోటల్ మేనేజర్ అని స్థానిక మీడియా నివేదికలు తెలుపుతున్నాయి.