Health tips : చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి ఊబకాయం లేకపోయినా లావు పొట్టతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లావు పొట్ట కారణంగా కుదురుగా కూర్చోవాలన్నా, వంగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు పొట్ట తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయినా ఫలితం లేక విసిగిపోతారు. కానీ ఈ డ్రింక్‌ను రోజుకు రెండు సార్లు తాగితే మీ పొట్ట ఇట్టే కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ డ్రింక్ ఏమిటి..? దాన్ని ఎలా చేసుకోవాలి..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక స్పూన్ అల్లం పేస్టు, రెండు అంగుళాల దాల్చిన చెక్క, ఒక నిమ్మకాయ, అర స్పూన్ మిరియాలతో ఈ స్పెషల్ డ్రింక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో రెండు గ్లాసులు నీళ్లు పోయాలి. తర్వాత అందులో అల్లం పేస్టు, దాల్చిన చెక్క, స్పూన్ మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకుని కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయలో సగాన్ని నాలుగు ముక్కలుగా కోసి అందులో వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఓ పది నిమిషాలపాటు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి ఒక పరిశుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. అంతే మీ పొట్టను తగ్గించే స్పెషల్ డ్రింక్ రెడీ అయినట్టే. ఈ స్పెషల్ డ్రింక్‌ను ఉదయాన్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి వరుసగా గోరువెచ్చగా తాగితే 15 రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఒంట్లోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.