Sugar levels & Ladyfinger | రక్తంలో చక్కెర స్థాయిల్లో (suger levels) సమతుల్యత కోల్పోవడం వల్ల మధుమేహం వస్తుంది. దీనికి ఎలాంటి నివారణ అందుబాటులో లేదు. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను దీర్ఘకాలం పాటు అదుపులో ఉంచుకోని పక్షంలో కంటి చూపు (eye sight) దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గుండె జబ్బులు (heart problems) వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు కొనసాగితే కిడ్నీ (kidneys) లు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా, సరైన ఆహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. కూరగాయల్లో బెండకాయల (ladyfinger) ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు.
బెండకాయలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) (Glycemic Index) ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సరైన ఎంపిక. వీటిలో యాంటీఆక్సిడెంట్లు (anti oxidants) పుష్కలంగా ఉడి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ (Insulin) నిరోధకతను మెరుగుపరుస్తుంది. తద్వారా గర్భధారణ సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సరైన ఎంపిక.
ఒక అధ్యయనం ప్రకారం, ఇన్సులిన్ స్రావించడాన్ని పెంచడంతోపాటు కార్బోహైడ్రేట్ శోషణను మందగించడం ద్వారా యాంటీ-డయాబెటిక్ చర్యను ప్రదర్శిస్తుంది. వీటిలో ఉండే కరగని డైటరీ ఫైబర్ (dietary fibre) పేగుల నుంచి చక్కెరను గ్రహించే రేటును తగ్గిస్తుంది. ఆకలిని పరిమితం చేస్తుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండి మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. పేగుల ద్వారా చక్కెరను గ్రహించడాన్ని నియంత్రిస్తుంది. తద్వారా మధుమేహాన్ని అదుపు చేస్తుంది. ఇది శరీర బరువును నిర్వహించడానికి, గ్లూకోస్ టాలరెన్స్‌ని మెరుగుపరచడానికి, హెచ్‌బీఏ1సీ స్థాయిలను తగ్గించడానికి, లిపిడ్ ప్రొఫైల్‌ను సాధారణీకరించడానికి కూడా సహాయపడుతుంది.
బెండకాయలను ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని మన పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు సైన్స్ కూడా ఇదే విషయాన్ని మనకు సూచిస్తుండటం విశేషం. బెండకాయల్లో ఉండే ఐసోక్వెర్సిట్రిన్, క్వెర్సెటిన్ అనే ప్రధాన ఫ్లేవనాయిడ్లు రక్తంలో గ్లూకోజ్, సీరం ఇన్సులిన్, ట్రైగ్లిజరైడ్, టోటల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని ఒక అధ్యయనం తెలిపింది. బెండకాయలను తినడం వల్ల మధుమేహం కారణంగా వచ్చే కిడ్నీ రుగ్మతలను నయం చేసుకోవచ్చు.
బెండకాయలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, లీనోలేయిక్ యాసిడ్, విటమిన్ సీ, కాల్షియం, ప్రోటీన్, ఫోలేట్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు వండిన బెండకాయ తినడం ద్వారా దాదాపు 37 మైక్రోగ్రాముల ఫోలేట్ మన శరీరానికి అందుతుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా ఉంచేందుకు సహాయపడతాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల శరీరం బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. వీటిలో ఉండే పెక్టిన్ అనే ఎంజైమ్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని కలిగించకుండా నివారించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.