Fruits For High BP Patients | మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మనకు పలు రకాల పండ్లలో, ఇతర ఆహారాల్లో లభిస్తుంది. పొటాషియం ఉన్న ఆహారాలను తింటే రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. కనుకనే హైబీపీ ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినాలని వైద్యులు చెబుతుంటారు. పొటాషియం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలాగే క్యాల్షియం, మెగ్నిషియం కూడా రక్తపోటును తగ్గించే సహాయ పడతాయి. పొటాషియం ఎక్కువగా మనకు పలు రకాల పండ్లలో లభిస్తుంది. ఆయా పండ్లలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల ఇది కొవ్వును కూడా తొలగిస్తుంది. కాబట్టి పొటాషియం మనకు అనేక విధాలుగా మేలు చేస్తుంది.
పొటాషియం ఉన్న ఆహారాలను తింటే రక్తపోటు తగ్గుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. మన శరీరంలోని అన్ని కణాలు సరిగ్గా పనిచేసేందుకు కూడా పొటాషియం అవసరం అవుతుంది. పొటాషియం ఒక మినరల్ కనుక శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసేందుకు కూడా పనికొస్తుంది. మనం రోజూ తినే ఆహారాల్లో ఉండే సోడియంను సమతుల్యం చేసేందుకు కూడా పొటాషియం ఉపయోగపడుతుంది. సోడియం అధికంగా ఉంటే బీపీ పెరుగుతుంది. కిడ్నీ సమస్యలు వస్తాయి. కనుక సోడియం స్థాయిలు నియంత్రణలో ఉండాలన్నా అందుకు పొటాషియం అవసరం అవుతుంది. ఇలా పొటాషియం మనకు పలు రకాలుగా మేలు చేస్తుంది.
నేరేడు పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఎ కూడా ఈ పండ్లలో అధికంగానే ఉంటుంది. ఈ సీజన్లో ఈ పండ్లు మనకు అధికంగా లభిస్తాయి. కనుక హైబీపీ ఉన్నవారు ఈ పండ్లను తింటే బీపీని నియంత్రించవచ్చు. అలాగే యాప్రికాట్లలోనూ మనకు పొటాషియం అధికంగానే లభిస్తుంది. ఇవి మనకు మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తున్నాయి. ఈ పండ్లలో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తసరఫరాను మెరుగు పరిచి బీపీని తగ్గిస్తుంది. అలాగే అవకాడోలను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా పొటాషియంను పొందవచ్చు. ఈ పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. అలాగే పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే అరటి పండ్లను పొటాషియంకు మంచి నెలవుగా చెప్పవచ్చు. ఒక అరటి పండును తింటే సుమారుగా 2.83 గ్రాముల ఫైబర్, 422 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇవి బీపీని తగ్గిస్తాయి. హైబీపీ ఉన్నవారు ఒక అరటి పండును తింటే వెంటనే బీపీ కంట్రోల్ అవుతుంది. అరటి పండ్లలో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తర్బూజా పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇందులో నీరు అధికంగా ఉంటుంది. ఈ పండ్లు పుచ్చకాయ కుటుంబానికి చెందినవి. పొటాషియం, విటమిన్లు ఎ, సి ఈ పండ్లలో అధికంగా ఉంటాయి. ఒక కప్పు అంటే 160 గ్రాముల తర్బూజాలను తింటే 495 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. ఈ పండును తొక్క తీసేసి తినాల్సి ఉంటుంది. ఇలా పలు రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇవి బీపీని అదుపులో ఉంచుతాయి.