Onions | మన వంట గదిలో ఎప్పడూ ఉండేది.. అన్ని కూరల్లో తప్పకుండా వేసుకునేది ఉల్లిపాయ. ఇవి కూరకు మంచి రుచిని అందిస్తాయి. గ్రేవీని పెంచడంలోనూ తోడ్పడుతుంది. అయితే రోజూ కర్రీలో వేసుకునే ఉల్లిపాయలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. షుగర్ లెవెల్స్
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే లక్షణాలు ఉల్లిపాయల్లో మెండుగా ఉంటాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే రసాయనాలు కూడా ఉల్లిపాయలో పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి పచ్చి ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది.
2. చర్మ ఆరోగ్యానికి
ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి రక్షిస్తాయి. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం మెరిసేలా ఆరోగ్యంగా మారుతుంది.
3. బరువు నియంత్రణ
ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది మీ కడపు ఎక్కువ సేపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. ఫలితంగా శరీర బరువు నియంత్రణలో ఉంచుతుంది.
4. ఎముకలకు బలం
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. బోలు లాంటి ఎముకల వ్యాధిలకు దూరంగా ఉంచుతాయి.
5. ఆక్సీకరణ ఒత్తిడి
యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాలు తగ్గుతాయి. ముఖ్యంగా శరీరం ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు ఉల్లిపాయలు చాలా సహాయపడతాయి.
6. గుండెకు మంచిది
ఉల్లిపాయలోని సల్ఫర్ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వంటివి దరి చేరకుండా ఉంటాయి.
7. జీర్ణవ్యవస్థ
ఫైబర్ అధికంగా ఉండే ఉల్లిపాయను పచ్చిగా తిన్నా.. వండుకుని తిన్నా సులభంగా అరుగుతుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అలాగే దీంట్లోని ప్రీబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
8. క్యాన్సర్ నివారణ
ఉల్లిపాయలోని సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తాయి. కొలొరెక్టల్, కడుపు కాన్యర్ వంటి ప్రాణాంతక క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించే లక్షణాలు ఉల్లిపాయకు ఉన్నాయి.