Heavy Weight | అధిక బరువుతో బాధపడుతున్నారా? వీటితో సమస్యకు చెక్ పెట్టండి..!
Heavy Weight | జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు మనిషికి మనః శాంతిని దూరం చేస్తున్నది. సరైన వేళకు తినకపోవడం, నిద్ర పోకపోవడం బరువు పెరగడానికి కారణాలు. ఒకసారి బరువు పెరిగిన తర్వాత తగ్గించుకునేందుకు చాలా శ్రమించాల్సిన పరిస్థితి. వ్యాయామంతో పాటు ఆహారంలోనూ మార్పులు అవసరం. ఈ క్రమంలో కొందరు అధిక బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ, కొందరికి సమయం దొరక్క.. ఆహారం తీసుకోవడం తగ్గిస్తూ వస్తుంటారు. బరువు పెరుగడంతో ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులు, మధుమేహం, అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆహారం ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడంతో ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చని, వీటిని తప్పక తీసుకోవాలని చెబుతున్నారు.
సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి..

సీజనల్‌గా దొరికే పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటితో అనేక విధాలుగా ప్రయోజనాలుంటాయి. ఒక్కో సీజన్‌కు ఒక్కో ప్రత్యేకత, లక్షణాలుంటాయి. సీజన్‌ను బట్టి మనకు అనేక రకాల పండ్లు, కూరగాయలు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయని, శరీరానికి అవసరమైన పోషకాలను వాటి నుంచి సులభంగా పొందవచ్చని చెబుతున్నారు. సీజనల్‌గా వచ్చే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
డ్రై ఫ్రూట్స్‌తో ప్రయోజనం..

ఫిట్బాడీ కోసం డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీషన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే రోజూ వాల్ నట్స్, బాదం, వేరుశెనగ, జీడిపప్పు, పిస్తా వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎండిన పండ్లు బరువును నియంత్రించడంలో అనేక విధాలుగా సహాయపడుతాయి.
పప్పులతో ప్రొటీన్లు..

బ్లాక్, వైట్ గ్రామ్స్తో శరీరానికి మంచి ప్రొటీన్లు అందుతాయి. వీటిని తీసుకుంటే కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తెల్ల శెనగలతో ఫైబర్ అందుతుంది. వీటిని తీసుకుండే కడుపు నిండినట్లుగా ఉంది. తద్వారా బరువును అదుపులో ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
తృణ ధాన్యాలతోనే..

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనంలో శుద్ధి చేసిన ధాన్యాల కంటే తృణధాన్యాలతోనే శరీరానికి ఆరోగ్యమని తేలింది. తృణధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును నియంత్రించడంలో ఉపయుక్తంగా ఉంటాయి. తృణధాన్యాలు కేలరీలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. దీంతో జీవక్రియ సైతం చక్కగా ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

