గుండెకు మేలుచేసే ఆహార పదార్థాలు డెమెన్షియాను ఢీ కొడతాయని తేలింది. హార్వర్డ్ యూనివర్సిటీ, చైనాలోని మరికొన్ని యూనివర్సీటీలకు చెందిన పరిశోధకులు 55 ఏండ్లు, ఆపై వయసు కలిగిన 10,000 మంది నుంచి ఐదేండ్లపాటు సేకరించిన సమాచారం పరిశీలించారు. ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కూరగాయలు, రెండు కంటే ఎక్కువసార్లు పండ్లు తిన్నవారిలో కాలక్రమంలో మెదడు పనితీరు బాగా ఉన్నట్టు గ్రహించారు.
బ్రసెల్స్ స్ప్రౌట్స్, కాలిఫ్లవర్, కేల్, పాలకూర వంటి ఆకుకూరలు, బీట్రూట్, స్కాష్ వంటి ఎరుపు, పసుపు కూరగాయలు మరింత మంచివి అని పరిశోధకులు పేర్కొన్నారు. మరో అధ్యయనంలో ఆలివ్ నూనె తీసుకున్న అమెరికన్లలో డెమెన్షియా సంబంధిత మరణం ముప్పు తక్కువని కనుక్కొన్నారు.