Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
గుండెపోటు అంటే సాధారణంగా ఛాతిలో తీవ్రమైన నొప్పి, బరువు లేదా ఒత్తిడి వంటి లక్షణాలే గుర్తుకు వస్తాయి. అయితే మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలాసార్లు స్వల్పంగా లేదా సాధారణ లక్షణాలకు భిన్నంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుతం యువతుల్లోనూ గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి.
Heart Attack | గుండెపోటు అంటే సాధారణంగా ఛాతిలో తీవ్రమైన నొప్పి, బరువు లేదా ఒత్తిడి వంటి లక్షణాలే గుర్తుకు వస్తాయి. అయితే మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలాసార్లు స్వల్పంగా లేదా సాధారణ లక్షణాలకు భిన్నంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుతం యువతుల్లోనూ గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల మహిళలు తమ శరీరంలో కనిపించే అసాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండడం అవసరం.
లక్షణాలు ఎలా ఉంటాయి..
మహిళల్లో గుండె సంబంధిత సమస్యల లక్షణాలు ఇతరులతో పోలిస్తే తక్కువ తీవ్రతతో కనిపిస్తాయి. ఛాతిలో అసౌకర్యం లేదా నొప్పి, బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం సాధారణంగా మెనోపాజ్‌కు ముందు తక్కువగా ఉండి, ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు వంటి ఇతర ప్రమాద కారకాలు ఉన్నప్పుడు గుండె జబ్బుల ముప్పు మరింత పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న మహిళలు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
పరీక్షల ద్వారా నిర్దారణ..
గుండెపోటుకు ముందు ఛాతిలో నొప్పి లేదా బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా సమీపంలోని అత్యవసర వైద్య విభాగానికి వెళ్లాలి. అక్కడ గుండెకు ఏమైనా నష్టం జరిగిందా తెలుసుకోవడానికి ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ట్రోపోనిన్ పరీక్ష కీలకమైనది. గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గి కణాలు దెబ్బతిన్నప్పుడు ట్రోపోనిన్ అనే ప్రోటీన్ రక్తంలోకి విడుదలవుతుంది. రక్తంలో దీని స్థాయి పెరిగినట్లు తేలితే గుండె కండరాలు దెబ్బతింటున్నట్లు గుర్తించి, అవసరమైన చికిత్సను వెంటనే ప్రారంభిస్తారు.
జాగ్రత్త పడడం ముఖ్యం..
గుండె పరిస్థితిని అంచనా వేయడానికి ఛాతీ ఎక్స్‌రే, ఎకోకార్డియోగ్రఫీ వంటి ఇతర పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. ఛాతీ ఎక్స్‌రే ద్వారా గుండె పరిమాణం పెరిగిందా, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరిందా వంటి విషయాలను తెలుసుకునే వీలు ఉంది. ఎకో పరీక్షలో గుండె గదుల నిర్మాణం, గుండె ఎంత సమర్థంగా రక్తాన్ని పంప్ చేస్తోంది, గుండెలోని నాలుగు కవాటాల్లో ఏవైనా లీకేజీ లేదా ఇతర సమస్యలు ఉన్నాయా వంటి అంశాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా మహిళల్లో గుండెపోటు లక్షణాలు స్పష్టంగా కనిపించవు. కాబట్టి ఛాతిలో అసౌకర్యం లేదా ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

