HomeHealthHealth Will Spoil If You Eat These At Night
Health Tips | వీటిని రాత్రి పూట తినకపోవడం మంచిది..!
Health Tips | కొన్ని ఆహారాలను పగటి వేళ తీసుకోవడం ఉత్తమం కాగా, మరికొన్నింటిని రాత్రి సమయంలోనే తినడం చాలా మంచిది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే.. అన్నం, పెరుగు, మాంసం వంటివి రాత్రి వేళ తినకుండా చేసుకోవాలి.
Health Tips | మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారాలు తీసుకోవాలి. ఉదయం తినే వాటిపై కన్నేయాలి. రాత్రిళ్లు కొన్ని తినకుండా దూరం పెట్టాలి. మరికొన్ని ఆహారాలను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. మన ఆరోగ్యానికి పనికొచ్చే కొన్ని టిప్స్ మీ కోసం..
అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది.
ఆపిల్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలతో కలిపి తీసుకోకుండా చూసుకోవాలి.
ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. వీటిని రాత్రిళ్లు తీసుకోకుండా చూడాలి.
వెనువెంటనే శక్తిని అందించే గుణం బంగాళాదుంపల్లో ఉంటుంది. అందుకని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది.
మొలకెత్తిన విత్తనాలు, గింజలను ఎప్పుడు తీసుకున్నా ప్రయోజనం ఉటుంది.
ఉదయం నిద్రలేవగానే మొలకెత్తిన గింజలు, విత్తనాలు తింటే పోషకాలు మెండుగా లభిస్తాయి.
వరి అన్నం రాత్రి పూట తినకూడదు. మధ్యాహ్నం మాత్రమే తినేలా చూసుకోవాలి.
రాత్రి వేళ వరి అన్నానికి బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు తినడం మేలు.
పెరుగును కేవలం పగటి వేళనే తినాలి. రాత్రి సమయంలో పెరుగు త్వరగా జీర్ణం కాదు.
మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకని మధ్యాహ్నమే తినాలి.
పాలు జీర్ణమయ్యేందుకు ఎక్కువ టైం అవసరం. అందుకని రాత్రి వేళ తీసుకోవడం ఉత్తమం.