Cold | కాలం మారింది. ఎండలు దంచికొడుతున్నాయి. కాలు బయటపెట్టాలంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి. అత్యవసరమైన పనుల కోసం ఇంట్లోంచి బయటికెళ్తే చాలు.. కొందరిని జలుబు వేధిస్తుంది. అవును, దానిపేరే.. ‘వేసవి జలుబు’ మరి! ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి..
విటమిన్-సి ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ బలంతో జలుబుకు కారణమైన వైరస్లకు అడ్డుకట్ట పడుతుంది. నారింజ, నిమ్మకాయలు వంటివి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా జలుబు చేస్తుంది. కాబట్టి, నీళ్లు ఎక్కువగా తాగాలి. వీలున్నప్పుడు పండ్ల రసాలు తీసుకోవచ్చు. గ్లాసునిండా వేడి పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగినా ఉపశమనం ఉంటుంది. ఇది అన్నిటికంటే ఉత్తమమైన మార్గమని చెబుతారు.
“జలుబుతో మీ చిన్నారులు సతమతమవుతున్నారా? ఇలా చేస్తే సత్వర ఉపశమనం!!”
“బిడ్డకు సర్ది అయ్యిందా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!”
ఈ ఫుడ్ తింటే అలర్జీలు అవుతున్నాయా? అయితే జాగ్రత్త !!
నేను ప్రేమించిన వాడికి అబ్బాయిలంటేనే ఇష్టం.. అతన్ని అసలైన మగాడిగా ఎలా చేయాలి?