బెంగళూరు: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ సారథి తిలక్ వర్మ (106 బ్యాటింగ్) శతకంతో మెరిశాడు. నార్త్‌జోన్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో ఈ హైదరాబాదీ బ్యాటర్‌కు తోడు శ్రేయస్ గోపాల్ (88) రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 285/9గా నిలిచి 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఇక, సెంట్రల్, ఈస్జ్ జోన్ మధ్య సెమీస్ రసవత్తరంగా సాగుతున్నది.
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92) దంచికొట్టాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నప్పటికీ ఈ టోర్నీలో ఫిఫ్టీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (15 ఏండ్ల 157 రోజులు) రికార్డు సృష్టించాడు. వైభవ్ మెరిసినా సెంట్రల్ మాదిరిగానే 266 పరుగుల వద్దే ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్ (69) కూడా రాణించగా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన సెంట్రల్.. ఆట చివరికి 3 వికెట్ల నష్టానికి 43 రన్స్ చేసింది.