హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్) పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియా దేశంతో కలిసి పనిచేయాలని సింగరేణి సంస్థను మోనాష్ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈ మేరకు వర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతితో సమావేశమయ్యింది.
ఈ సందర్భంగా మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యూనిస్ వెంటికోస్ ఆస్ట్రేలియాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో గల అవకాశాలను వివరించారు. దీనిపై స్పందించిన సీఎండీ ఉన్నత స్థాయి బృందాన్ని ఆస్ట్రేలియాకు పంపిస్తామని హామీ ఇచ్చారు.