Health tips | ఈ ఆరు అలవాట్లు పాటిస్తే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చట..!
Health tips | మనం తినే ప్రతి ముద్ద శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు, రక్తంలో చక్కెర స్థాయిల (Sugar levels) ను కూడా నిర్ణయిస్తుంది. ఒకసారి బ్లడ్ షుగర్ ఎక్కువైనా, ఒక్కసారిగా తగ్గిపోయినా శరీరం వెంటనే సంకేతాలు ఇస్తుంది. అలసట, ఆకలి, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు మొదలవుతాయి.
Health tips : మనం తినే ప్రతి ముద్ద శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు, రక్తంలో చక్కెర స్థాయిల (Sugar levels) ను కూడా నిర్ణయిస్తుంది. ఒకసారి బ్లడ్ షుగర్ ఎక్కువైనా, ఒక్కసారిగా తగ్గిపోయినా శరీరం వెంటనే సంకేతాలు ఇస్తుంది. అలసట, ఆకలి, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే రోజువారీ జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లు పాటిస్తే బ్లడ్ షుగర్‌ను రోజంతా స్థిరంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాటించాల్సిన ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సమతుల ఆహారం
బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సమతుల ఆహారం కీలకంగా పనిచేస్తుంది. ప్రతి భోజనంలో ప్రొటీన్, పీచు, గుడ్ కొలెస్టరాల్ ఉండేలా చూసుకోవాలి. చికెన్, చేపలు, గుడ్లు, పప్పులు, టోఫూ వంటి ప్రొటీన్ ఆహారాలు మంచివి. కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. తీపి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, శీతల పానీయాలను తగ్గించడం మంచిది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్
అన్ని కార్బోహైడ్రేట్లు ఒకేలా పనిచేయవు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దాంతో రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. ఓట్స్, బ్రౌన్‌రైస్, క్వినోవా, పప్పులు, పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలు ఇందుకు మంచి ఎంపికలు. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
భోజనం సమయం
ఉదయం అల్పాహారాన్ని ఎప్పుడూ మానేయొద్దు. నిద్రలేచిన రెండు గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిది. మూడు నుంచి నాలుగు గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవాలి. తినేటప్పుడు ముందుగా కూరగాయలు, తర్వాత ప్రొటీన్, చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోవడం ఉపయోగకరం. చిన్న ప్లేట్లు ఉపయోగిస్తే ఆహార పరిమాణాన్ని కూడా సులభంగా నియంత్రించవచ్చు.
రోజువారీ అలవాట్లు
భోజనం చేసిన వెంటనే పది నిమిషాలు నడవడం మంచి ఫలితాలు ఇస్తుంది. వారానికి కనీసం మూడు రోజులు కండరాల బలం పెంచే వ్యాయామాలు చేయాలి. మొత్తం వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రోజూ 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం కూడా మంచిదే. రోజంతా తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు.
ఆహార పరిమాణం
ఎంత ఆరోగ్యకరమైన ఆహారం అయినా మోతాదుకు మించి తింటే ప్రయోజనం తగ్గుతుంది. అందుకే ఒకేసారి ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలి. చిన్నచిన్న మోతాదుల్లో ఆహారం తీసుకోవడం మంచిది. మధ్యలో ఆకలివేస్తే పండ్లతోపాటు బాదం, వాల్నట్స్ లేదా కొద్దిగా చీజ్ తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఆకలి కూడా అదుపులో ఉంటుంది.
తరచూ పరీక్ష
మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయులను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. ఏ ఆహారం తిన్న తర్వాత షుగర్ ఎలా మారుతోందో గమనించాలి. ఆ సమాచారం ఆధారంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు. అవసరమైతే వైద్యుడి సలహాతో డైట్ ప్లాన్‌ను మార్చుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడంవల్ల భవిష్యత్‌లో వచ్చే సమస్యలను కూడా ముందుగానే గుర్తించవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

