Magnesium | మానవ శరీరంలో ఉండే అత్యంత సమృద్ధమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి. చాలా పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. కొన్ని పోషకాల లోపంతో ఇబ్బంది లేకపోయినా.. మరికొన్ని పెరుగుదలకు చాలా అవసరం. అవి లేకుండా జీవించడం కష్టం. అలాంటి పోషకాలలో మెగ్నీషియం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా నలుగురిలో ఒకరు మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. మనలో 80శాతం మంది జనం మెగ్నీషియంను తీసుకోవడం లేదట. ఈ ఖనిజం లోపంతో తలనొప్పులు, ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి లక్షణాలు ఉధృతమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల మెరుగైన ఆరోగ్యం కోసం మీ డైట్‌ను సరిచూసుకోవడం తప్పనిసరి. ఈ ఖనిజం ఆహారాన్ని శక్తిగా మార్చడం, కణాలను బాగు చేయడం, అమైనో ఆమ్లాలను ఉపయోగించి ప్రొటీన్లను తయారు చేయడం, కండరాల కణజాలం సడలించడానికి కూడా దోహదపడుతుంది.
మన శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన ఏడు సూక్ష్మమైన ఖనిజాల్లో మెగ్నీషియం ఒకటి. మానవులు రోజుకు కనీసం 100 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెగ్యులర్‌గా మెగ్నీషియం తీసుకోవడం వల్ల అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్, కార్డియో వాస్కులర్ డిసీజ్, మైగ్రేన్‌ను నియంత్రించడంతో పాటు నయం చేయొచ్చు. మెగ్నీషియం అనేక ఆహార పదార్థాలలో లభిస్తుంది. మన శరీరంలో ఈ ఖనిజం అవసరాన్ని తీర్చడం కోసం రోజువారీ ఆహారంలో భాగమయ్యేలా చూసుకోవాలి. మెగ్రీషియంను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని మీ కోసం..
మెగ్నీషియంను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా శరీరంలోని రక్తపోటు స్థాయిలను సాధారణ స్థితికి తెస్తుంది. అలాగే బాడీలో రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తపోటుతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది. ఇది ఇది రక్తపోటు స్థాయిలు తరచుగా పెరగడానికి దారితీస్తుంది. నిరంతరం అధిక రక్తపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని, గుండెకు సంబంధించిన వివిధ రకాల వ్యాధులను కూడా పెంచుతుంది. కాబట్టి, ఈ ఖనిజాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తపోటు స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా గుండెజబ్బులకు సంబంధించిన రిస్క్‌ను దూరం చేసుకోవచ్చు.
శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలపై మెగ్నీషియం ప్రభావాలను టైప్ 2 మధుమేహంతో బాధపడే రోగులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచేందుకు ఈ ఖనిజాన్ని తప్పనిసరిగా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి.
పార్శ్వపు తలనొప్పి లేదా మైగ్రేన్‌తో చాలా మంది బాధపడుతున్నారు. నొప్పితో తలలో ఏదో కొట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. తరుచూ తగ్గుతూ మళ్లీ తీవ్రమవుతుంది. ఈ సమయంలో ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి మెగ్నీషియం అద్భుతమైన ఔషధంగా పేర్కొంటున్నారు. ఈ ఖనిజం లోపం న్యూరోట్రాన్స్మీటర్లపై ప్రభావం చూపి, తలనొప్పి మరియు బలహీనతకు దారితీస్తుంది. అధిక ఒత్తిడితో మెగ్నీషియం మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. మెగ్నీషియం స్థాయి తగ్గితే మరింత ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.
మెగ్నీషియం ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనికి అదనంగా, రొమ్ము మృధుత్వం, మూడ్, బ్లోటింగ్‌ను నిరోధించడం, నయం చేయడానికి ఈ ఖనిజం ఎంతో ఉపకరిస్తుంది.
మెగ్నీషియం లోపంతో ఆందోళన, ఒత్తిడితో బాధపడుతుంటున్నారు. మెగ్నీషియం లోపాలతో బాధపడని వ్యక్తులు సాధారణంగా తక్కువ ఒత్తిడిలో ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే మెగ్నీషియం మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే మెగ్నీషియం ఒత్తిడితో కూడిన మలబద్దకాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.