న్యూఢిల్లీ : చలికాలంలో ఫేవరెట్ డ్రింక్‌ను సిప్ చేయడంతో పాటు ఆ కప్పులోనే ఆరోగ్యం, ఆనందం దాగుంటే (Ragi Hot Chocolate Recipe) అంతకంటే కావాల్సింది మరోటి ఉండదు. ఫెస్టివ్ క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్లో వెల్వెటీ చాక్లెటీ డ్రింక్ మనకు ఇష్టమైన డ్రింకే కాకుండా, శీతాకాలం చలిని బీట్ చేసేందుకూ మేలైన ఎంపిక.
హాట్ చాక్లెట్‌కు ఆరోగ్యకరమైన ట్విస్ట్ ఇవ్వాలంటే రాగి హాట్ చాక్లెట్ డ్రింక్ మెరుగైన ఛాయిస్‌గా ముందుకొస్తుంది. హాట్ చాక్లెట్‌తో రాగి పోషకాహార ప్రయోజనాలు తోడైతే అద్భుతమైన హెల్ధీ డ్రింక్ సిద్ధమవుతుంది.
హాట్ చాక్లెట్లో రాగిని మిక్స్ చేయడం ద్వారా అందులోని క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్ పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మిల్లెట్స్‌ను డైట్లో భాగం చేసుకోవడం ద్వారా ముఖ్యంగా రాగితో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. దీంతో ఈ డ్రింక్‌కు చాక్లెట్ నట్టీ టేస్ట్ సమకూరుతుంది.
Read More :