Radish | ముల్లంగిలో మనకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!
ముల్లంగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజానాలు ఏంటీ?.. ముల్లంగి ఎలా తినాలి?.. జూస్ చేసుకుని తాగితే మంచిదా?.. ముక్కలుగా తింటే ఎక్కవ ప్రయోజనం ఉంటుందా?.. కింద వీడియోలో చూడండి..
Health benefits of Radihs | ముల్లంగి చూడటానికి తెల్లగా ఉన్నా తింటే ఘాటుగా ఉంటుంది. అందుకే దీన్ని డైరెక్ట్‌గా కూర వండటం చాలా తక్కువ. సాంబార్లో క్యారెట్‌కు బదులు ముల్లంగి వాడుతారు. ముఖ్యంగా చలికాలంలో ప్రకృతి మనకు అందించే ఈ ముల్లంగి వల్ల మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
ముల్లంగి తింటే మలబద్దకం మన దరిచేరదు. అజీర్తి అనే మాటే వినపడదు. కడుపు నొప్కపి, ఆకలి మందగించడం వంటి సమస్యలకు ముల్లంగి మంచి పరిష్కారం. Radish Juice రూపంలోనైనా, ముక్కలుగా తరుగుకునైనా తినొచ్చు. ఘాటు పోవడానికి ముల్లంగి ముక్కలకు కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుంటే బాగుంటుంది. లేదా… సన్నగా కట్‌చేసిన ముల్లంగి ముక్కలను మెత్తగా నూరి చిక్కని రసంలా తయారు చేసుకుని అందులో తేనే కలుపుకుని రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముల్లంగి గడ్డనే కాదు దాని ఆకులు కూడా మంచి మెడిసనే. ఆకులను నూరి రసంగా తయారు చేసుకుని రోజుకు ఒక కప్పు చొప్పున 15 రోజులు తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
ముల్లంగి గింజలు కూడా మంచి ఔషధంగా పని చేస్తాయి. ఒక చెంచా ముల్లంగి గింజలను ఆవుపాలలో మరిగించి ఆ కాషాయానికి కొంచెం ఉప్పు, నిమ్మరసం, పెప్పర్ పొడి యాడ్ చేసుకుని ప్రతిరోజూ రాత్రిపూట తాగితే నెల రోజుల్లో శ్రీఘ్రస్కలన సమస్య తగ్గుతుంది.
ముల్లంగిలో క్యాన్సర్ నిరోధక గుణాలుంటాయి. ఇవి క్యాన్సర్ కణితుల పెరుగుదలను అడ్డకుంటాయి. రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించి మదుమేహాన్ని నియంత్రిస్తాయి.
-
అద్భుత ఫిజిక్ మీ సొంతం కావాలంటే..!
-
Health Tips | మునగతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
-
Sleep | ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వయసులో ఎంత నిద్ర అవసరం?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

