Health Tips | అద్భుత ఫిజిక్ మీ సొంతం కావాలంటే..!
బరువు తగ్గడం అనేది ఎంతో సంక్లిష్టమైన టాస్క్ అని చెబుతుంటారు. జీవన శైలి, ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించినప్పుడే బరువు తగ్గడంలో (Health Tips) ఆశించిన ఫలితాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : బరువు తగ్గడం అనేది ఎంతో సంక్లిష్టమైన టాస్క్ అని చెబుతుంటారు. జీవన శైలి, ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించినప్పుడే బరువు తగ్గడంలో (Health Tips) ఆశించిన ఫలితాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు ఎన్నో చిట్కాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నా వ్యక్తులను బట్టి అందుకు అనుగుణమైన ప్రత్యేక ఫార్ములాను అనుసరించడం ద్వారానే వెయిట్ లాస్ లక్ష్యాలను అందుకోగలం.
కొన్ని జీవనశైలి మార్పులు కొందరికి ఫలితాలనిస్తే అందరికీ అవే ఫలితాలు కనిపించాలని ఆశించలేం. బరువు తగ్గడమనేది ఆరోగ్యకరమైన పద్ధతులతో సధిస్తే అది ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. సమతులాహారంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనే ఆరాటంలో భోజనం మానివేయడం, భోజనానికి భారీ విరామం ఇవ్వడం వంటివి చేయవద్దని చెబుతున్నారు.
నిపుణుల సూచనలు లేకుండా మీరంతట మీరే ఉపవాసంతో గడిపితే జీవక్రియల వేగం మందగించి బరువు తగ్గడం అటుంచి ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో అధిక ప్రొటీన్లు ఉండేటా చూసుకోవడంతో మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా, కడుపు నిండిన భావనతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. బరువులు ఎత్తడం ద్వారా కండరాలు బలోపేతమై జీవక్రియల వేగం పెరుగుతుంది. దీంతో ఎక్కువగా తిన్నా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం జరగదు. ఇక రోజుకు మూడు లీటర్ల నీరు తాగడం, తగినంత నిద్ర, భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవటం వంటివి పాటిస్తే అధిక బరువు సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read More
Tea | రైలు ప్రయాణంలో ఒక కప్పు ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

