శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Aug 15, 2020 , 13:52:22

న‌వ్వుతో కూడా క‌రోనాను జ‌యించ‌వ‌చ్చు.. అంతేకాదు మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలు!

న‌వ్వుతో కూడా క‌రోనాను జ‌యించ‌వ‌చ్చు.. అంతేకాదు మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలు!

న‌వ్వు నాలుగు విధాల చేటు అంటారు. క‌రోనా టైంలో ఎవ‌రేమ‌నుకున్నా ప‌ర్వాలేదు. న‌వ్వుతూనే ఉండండి. ఇప్పుడు ఎవ‌రేమ‌నుకుంటారో అని ప‌ట్టించుకుంటే మీరే లేకుండా పోతారు. క‌రోనా నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఏం చేస్తే మంచిదో ఆ ప‌నుల‌న్నీ చేసేయాలి. ముఖ్యంగా ఏం జ‌రిగినా న‌వ్వుతూ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజురోజుకు పెరిగిపోతున్న క‌రోనా కేసుల‌తో ముఖంలో చిరున‌వ్వే క‌న‌బ‌డ‌కుండా పోతుంది. అలాంటి వారి కోస‌మే ఈ సూచ‌న‌లు. ఏం వ‌చ్చినా ఎదుర్కోవ‌డానికి ఒక చిన్న చిరున‌వ్వు చాలు. అలాగే క‌రోనాను ఎదుర్కోవాల‌న్నా న‌వ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక‌టే కాదు. న‌వ్వువ‌ల్ల మ‌రెన్నో ప్రయోజ‌నాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

* వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న‌ప్ప‌టికీ వ‌ర్క్ విష‌యంలో ఒత్తిడి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అందుకే కాసేపు వ‌ర్క్ చేసినా త‌ర్వాత ఇంట్లోని పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డ‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మ‌న‌సంతా ఉల్లాసంగా ఉంటుంది. 

* ప్ర‌తిరోజూ న‌లుగురితో స‌ర‌దాగా మాట్లాడుతూ ఉండ‌డం వ‌ల్ల ఆందోళ‌న దూర‌మ‌వుతుంది. అంతేకాదు ఒత్తిడికి కార‌ణ‌మ‌య్యే హార్మోన్ల శ్రావకాలు తగ్గుముఖం పడతాయి. 

* రోజుకు ప‌ది నిమిషాలు న‌వ్వితే చాలు 10-20 మి.మీల రక్తపోటు తగ్గుతుందట.

* ఒంట‌రిగా ఉండే వారికి న‌లుగురిలో క‌లిసిపోయే వారికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంటుంది. త‌ర‌చూ న‌వ్వేవారికి గుండెజ‌బ్బు ప్ర‌మాదాలు త‌క్కువ‌గా ఉంటాయి.

* డ‌యాబెటీస్, డిప్రెషన్‌, ఇన్సోమియా, రక్తపోటు, మైగ్రేన్‌, ఆతృత, అలర్జీ, పెప్టిక్‌ అల్సర్ వంటి రోగాల‌ను సైతం త‌రిమికొట్ట‌డానికి న‌వ్వు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒత్తిడితో వ‌చ్చే ఏ స‌మస్య‌ల‌కైనా న‌వ్వే ప‌రిష్కారం.

* రోగ‌నిరోధ‌క శ‌క్తి వ్య‌వ‌స్థ‌కు అవ‌స‌ర‌మ‌య్యే లింపాజైట్స్ ఉత్ప‌త్తి మెరుగ‌వ్వాలంటే న‌వ్వుతోనే సాధ్యం. 

* అస్త‌మాతో బాధ‌ప‌డేవారికి న‌వ్వు మంచి ఔష‌ధం.

* ర‌క్తంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెర‌గాలంటే న‌వ్వుతూ ఉండాలి. దీంతో ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది.

* ముక్కు, శ్వాస‌కోశాల్లోని పొర‌లు ఆరోగ్యంగా ఉండాలంటే న‌వ్వ‌డ‌మే.

* నవ్వు శరీరంలో సహజ రోగ నిరోధక హార్మోన్ల ఉత్పత్తి పెంచుతాయి. ఫలితంగా ఆర్థరైటిస్‌, స్పాండలైటిస్‌, మైగ్రేన్‌ లాంటి వ్యాధులు దరిచేరవు. 


logo