న్యూఢిల్లీ : దైనందిన జీవితంలో మనం పలు రకాల వంటనూనెలు (Health Tips) వాడుతుంటాం. మార్కెట్లో ఎన్నో రకాల నూనెలు లభిస్తున్నా కొన్ని మాత్రమే ఆరోగ్యం, పోషకాలను అందించేవి అందుబాటులో ఉంటాయి. అలాంటి ఆయిల్స్‌లో సోయాబీన్ ఆయిల్ ఒకటి. ఇటీవల కాలంలో సోయాబీన్ ఆయిల్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సోయాబీన్ ఆయిల్‌ను వాడుతున్నారు. 2021, 2022 మధ్యనే ఏకంగా 62 మిలియన్ టన్నుల సోయాబీన్ ఆయిల్ ఉత్పత్తి అయిందని సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించడం చూస్తుంటే సోయాబీన్ ఆయిల్‌కు పెరుగుతున్న ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. సోయాబీన్ ఆయిల్ వాడకంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు.
సోయాబీన్ ఆయిల్ ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది. ఇందులో ఉన్న పాలీ అన్‌శాట్యురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఇందులో ఉండే ఆరోగ్యకర కొవ్వులు హృద్రోగ ముప్పును నివారిస్తాయని కూడా కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. సోయాబీన్ ఆయిల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించి కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పును తగ్గిస్తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) పేర్కొంది. ఇంకా సోయాబీన్ ఆయిల్‌తో ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
గుండెకు మేలు
ఎముకల బలోపేతం
చర్మసౌందర్యం
కేశ సంరక్షణ
వృద్ధాప్య ఛాయలకు చెక్