Ginger For Weight Loss | అల్లాన్ని మనం నిత్యం వంటల్లో వేస్తుంటాం. దీని వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఆయుర్వేద ప్రకారం అల్లంలో అద్భుతమైన ఔషధ విలువలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అల్లం రసం తాగినా లేదా అల్లాన్ని తింటున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అనేక వ్యాధులను తగ్గించేందుకు మనకు అల్లం ఎంతగానో పనిచేస్తుంది. అల్లాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే అధిక బరువును తగ్గించడంలోనూ అల్లం ఎంతగానో పనిచేస్తుంది. దీన్ని పలు విధాలుగా తీసుకోవడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
అల్లంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాల వల్ల శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. అల్లంను వాడితే అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆకలి పెరుగుతుంది. ఆకలి లేని వారు అల్లం రసంను తాగుతుంటే ఫలితం ఉంటుంది. అల్లంను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ సైతం తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అల్లం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను సైతం ఇది అందిస్తుంది. ఒక పాత్రలో కొన్ని నీటిని తీసుకుని అందులో కొద్దిగా అల్లాన్ని తురిమి వేయాలి. అనంతరం ఆ నీళ్లను బాగా మరిగించాలి. తరువాత వాటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగేయాలి. ఇలా రోజూ పరగడుపున తాగాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అల్లం వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీళ్లను వడకట్టి అందులో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి కలపాలి. తరువాత ఆ నీళ్లను తాగాలి. వీటిని కూడా ఉదయం పరగడుపునే తాగాల్సి ఉంటుంది. ఇలా ఈ నీళ్లను తాగుతుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువును తగ్గించడంలో ఈ మిశ్రమం కూడా బాగానే పనిచేస్తుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి ఉదయం పరగడుపునే తాగాలి. రోజూ ఇలా చేస్తుండాలి. దీని వల్ల కూడా బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఈ మిశ్రమం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు సైతం తగ్గిపోతాయి.
మీరు రోజూ తినే పండ్లను ముక్కలుగా కట్ చేసి సలాడ్‌లా చేసుకుని అందులో చిన్నపాటి అల్లం ముక్కలను కలిపి తినవచ్చు. ఇలా తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. మీరు తినే ఆహారంలోనూ ఇలా అల్లం ముక్కలను కలిపి తినవచ్చు. ఈ విధంగా అల్లంను తీసుకుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. కేవలం బరువు తగ్గడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.