కరోనా మన జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ శతాబ్దంలోని పెను విపత్తులలో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావాల్ని లెక్కగట్టడంలో వారు తలమునకలవుతున్నారు.
కరోనా కారణంగా మరణించిన ప్రతి ఒక్కరూ సగటున 16 సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోయారు. ఆ ప్రకారంగా లెక్కగడితే, మానవ సమాజం మొత్తం సుమారు 2 కోట్ల సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోయింది.
ఆహారం ద్వారా కరోనా వ్యాపిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవు.
మాస్కును ధరించడం వల్ల మనం తీసుకునే ఆక్సిజన్ పరిమాణం కొంత తగ్గినా అది ప్రాణవాయువు లోపంతో ఇబ్బంది పడేంత మాత్రం కాదని నిపుణులు అంటున్నారు. మనం వదిలిన కార్బన్-డై-ఆక్సైడ్‌ను మనమే మళ్లీ కొంత పీల్చుకున్నా శ్వాసకోశ వ్యవస్థ దాన్ని సమర్థవంతంగా నిరోధిస్తుంది.