Diabetes | మధుమేహులు ఈ పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు
Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని మధుమేహం బాధిస్తోంది. అనారోగ్యకర జీవనశైలి, వంశపారంపర్యంగా ఇలా కారణమేదైనా మధుమేహం ఎందరినో వెంటాడుతోంది.
Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని మధుమేహం బాధిస్తోంది. అనారోగ్యకర జీవనశైలి, వంశపారంపర్యంగా ఇలా కారణమేదైనా మధుమేహం ఎందరినో వెంటాడుతోంది. మధుమేహం బారినపడితే దీన్ని రివర్స్ చేయలేకున్నా సరైన నిర్ణయాలు, ఆరోగ్యం, వ్యాయామం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహ నియంత్రణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతుంటారు.
మన ఆహారంలో ఏం చేర్చుకోవాలి, వేటికి దూరంగా ఉండాలనే దానిపై మధుమేహులకు పూర్తి అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రతిరోజూ ఓ యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చనే నానుడి మధుమేహం విషయంలోనూ సరైనదే అంటారు వైద్య నిపుణులు. యాపిల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో ఇది మధుమేహంతో బాధపడేవారికి మేలు చేస్తుంది. యాపిల్ తీసుకోవడంతో శరీరంలో తక్షణమే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు.
అయితే మితంగా తీసుకుంటే దీని సత్ఫలితాలు పొందవచ్చు. ఇక యాపిల్తో పాటు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన జామ పండ్లను తీసుకోవచ్చు. తొక్క తీసి జామ పండ్లను తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్, జామతో పాటు మధుమేహులు ఆరెంజ్, కివీ పండ్లను తీసుకోవచ్చు. మరోవైపు మధుమేహంతో బాధపడేవారు మామిడి, లిచి, ద్రాక్ష, అరటి పండ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Read More :
Hyderabad | మద్యం మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

