Blood Sugar Levels | టైప్ 2 డయాబెటిస్ సమస్య ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రస్తుతం చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే షుగర్ వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండడం, శారీరక శ్రమ చేయకపోవడం, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండడం, రోజూ గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, వేళకు భోజనం చేయకపోవడం, ఆహారం అతిగా తినడం, నిద్రలేమి వంటి అనేక కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. ఈ వ్యాధి వచ్చిన వారు డాక్టర్ సూచన మేరకు క్రమం తప్పకుండా మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే సరైన జీవనశైలిని పాటించాలి. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి పలు ఆయుర్వేద చిట్కాలు కూడా ఎంతగానో పనిచేస్తాయి.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయను రోజూ తినాల్సి ఉంటుంది. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీన్ని రోజూ తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కనుక దీన్ని జ్యూస్ లేదా ట్యాబ్లెట్లు, పొడి రూపంలో తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా కూడా మేలు జరుగుతుంది. కాకరకాయ జ్యూస్ అయితే రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు 30 ఎంఎల్ మోతాదులో తాగాల్సి ఉంటుంది. కాకర కాయ ట్యాబ్లెట్లను ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 1 లేదా 2 వేసుకోవచ్చు. లేదా కాకరకాయ పొడిని నీటిలో కలిపి కూగా తాగవచ్చు. ఇలా ఈ చిట్కాను పాటిస్తుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే వంటల్లో వాడే దాల్చిన చెక్కను తింటున్నా కూడా షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇందుకు గాను దాల్చిన చెక్క వేసి మరిగించిన నీళ్లను రోజూ తాగాలి. లేదా దాల్చిన చెక్క పొడిని కూడా ఆహారాలపై చల్లి తినవచ్చు. ఇలా చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
షుగర్‌ను తగ్గించడంలో మెంతులు కూడా బాగానే పనిచేస్తాయి. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ మెంతుల పొడిని కలుపుకుని తాగితే డయాబెటిస్ తగ్గుతుంది. లేదా 1 టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తినాలి. అనంతరం వాటిని నానబెట్టిన నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తున్నా కూడా షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అదేవిధంగా నిత్యం ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ రసం తాగాలి. లేదా పూటకు రెండు లేదా మూడు ఉసిరికాయలను అలాగే తినవచ్చు. ఉసిరికాయల నుంచి తీసిన పదార్థాలతో చేసిన ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా డాక్టర్ సూచన మేరకు వాడుకోవచ్చు. దీని వల్ల షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
షుగర్‌ను తగ్గించేందుకు తిప్పతీగ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్క మన చుట్టూ పరిసరాల్లో పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల నుంచి రసం తీసి తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. తిప్పతీగ రసం మనకు మార్కెట్లో మందుల షాపుల్లోనూ లభిస్తుంది. తిప్పతీగ రసం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను రోజూ తాగడం వల్ల కూడా షుగర్‌ను తగ్గించుకోవచ్చు. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లను ఒక గ్లాస్ మోతాదులో మరుసటి రోజు ఉదయం పరగడుపునే తాగుతుండాలి. ఇలా రోజూ చేస్తుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఆయా ఆయుర్వేద చిట్కాలను రోజూ పాటిస్తుంటే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.