మధుమేహం దీర్ఘకాలిక సమస్య. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, దాన్ని శరీరం సరిగ్గా వాడుకోలేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు రక్తంలో షుగర్ హెచ్చుతగ్గులపై ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే, ఈ మార్పులు కిడ్నీలు, నరాలు, గుండె సమస్యలకు దారి తీస్తాయి. మందులు, జీవనశైలి మార్పులు చాలా అవసరం. వాటితోపాటు ఈ ఐదు పానీయాలు డయాబెటిస్‌కు అడ్డుకట్ట వేయడంలో బలంగా పనిచేస్తాయి. అయితే వైద్యుడి సలహా మేరకు వీటిని ప్రయత్నించండి.

కాకరకాయ చేదుగా ఉన్నా, మధుమేహులకు ఇది ఔషధం లాంటిది. కాకరకాయలో చారంటిన్, పాలీపప్టైడ్ లాంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ పనిచేసే విధానాన్ని మెరుగుపరుస్తాయి.
వాడే పద్ధతి: ఉదయం పూట తాజాగా తీసిన కాకరకాయ రసాన్ని తాగాలి. చేదు తగ్గించాలనుకుంటే, కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
చిట్కా: కాకరకాయ రసంతో ఉసిరి రసం కలిపి తాగితే రుచిగా ఉంటుంది. ఇది షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది. కిడ్నీ, కాలేయ ఆరోగ్యానికి కూడా సాయం చేస్తుంది.

మెంతుల్లో కరిగే పీచు పదార్థం (సాల్యుబుల్ ఫైబర్) ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దానివల్ల అల్పాహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర నిల్వలు అమాంతం పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.
వాడే పద్ధతి: ఒక టీస్పూన్ మెంతులు రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని తాగాలి. నానిన మెంతులను తినాలన్న నియమం ఏమీ లేదు.
ప్రయోజనం: ప్రతిరోజూ మెంతుల నీరు తాగే వారిలో షుగర్ నియంత్రణలో ఉంటుంది. కొవ్వును కరిగించడంలోనూ ఇది గుణం చూపిస్తుంది.

ఇది శరీరంలోని కణాలు షుగర్‌ను బాగా గ్రహించేలా సాయం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
వాడే పద్ధతి: ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగాలి.
ప్రయోజనం: దీన్ని తాగడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు తగ్గుతాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది.

ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరిలోని యాంటి ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరగడం, అకస్మాత్తుగా తగ్గడం ఉండదు.
వాడే పద్ధతి: ఉదయం పూట నీటిలో ఉసిరి రసం కలిపి తాగాలి. ఇది రోజంతా షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది.
ఇతర లాభాలు: ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గ్రీన్ టీ రోజును ప్రారంభించడానికి ఒక అద్భుతమైన మార్గం. గ్రీన్ టీలోని పాలిఫెనాల్స్ శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు త్వరగా స్పందించేలా చేస్తాయి. అంతేకాదు, ఇది జీర్ణవ్యవస్థలోకి షుగర్ ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
ప్రయోజనం: ప్రతిరోజూ గ్రీన్ టీ తాగేవారిలో జీవక్రియలు మెరుగుపడతాయి. చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
చిట్కా: మంచి ఫలితం రావాలంటే, టీలో చక్కెర అస్సలు కలపవద్దు. ఇది టైప్ 2 డయాబెటిస్ రాకుండా నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.