Weight Loss | బరువు తగ్గే ప్రణాళికలో చాలా మంది చేసే పొరపాట్లు ఇవే..
బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కేలరీలు లెక్కపెట్టడం వంటి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తూకంలో ఎలాంటి మార్పు కనిపించకపోతే నిరాశ కలగడం సహజం. అయితే ఇందుకు చాలా సందర్భాల్లో చాలా మందికి తెలియకుండానే చేస్తున్న కొన్ని చిన్న పొరపాట్లే కారణమవుతాయి.
Weight Loss | బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కేలరీలు లెక్కపెట్టడం వంటి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తూకంలో ఎలాంటి మార్పు కనిపించకపోతే నిరాశ కలగడం సహజం. అయితే ఇందుకు చాలా సందర్భాల్లో చాలా మందికి తెలియకుండానే చేస్తున్న కొన్ని చిన్న పొరపాట్లే కారణమవుతాయి. జీవనశైలిలోని కొన్ని అలవాట్లు బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. మొదటి ముఖ్యమైన కారణం సరిపడా నిద్ర లేకపోవడం. చాలామంది ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ చూపుతారు కానీ నాణ్యమైన నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. తగినంత నిద్ర లేకపోతే శరీర జీవక్రియ (మెటబాలిజం) మందగిస్తుంది. దీంతో రోజంతా శరీరం ఖర్చు చేసే కేలరీల పరిమాణం తగ్గుతుంది. అలాగే ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు రావడంతో తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది.
కేలరీలను తక్కువగా అంచనా వేయడం..
రెండో కారణం తీసుకుంటున్న కేలరీలను తక్కువగా అంచనా వేయడం. టీతో ఒక బిస్కెట్, మధ్యలో కొద్దిగా చిరుతిండి, వంట చేస్తూ ఒకటి రెండు ముక్కలు రుచి చూడడం వంటి చిన్న అలవాట్లు పెద్దగా అనిపించకపోయినా రోజంతా కలిపితే గణనీయమైన కేలరీలు చేరుతాయి. చాలా మంది తాము తీసుకునే కేలరీలను 15 నుంచి 30 శాతం వరకు తక్కువగా అంచనా వేస్తారని నిపుణులు చెబుతున్నారు. మూడో కారణం కేలరీలను సరిగా నమోదు చేయకపోవడం. చాలామంది తాము తిన్న ఆరోగ్యకరమైన ఆహారం, చేసిన వ్యాయామం మాత్రమే గుర్తుంచుకుంటారు. కానీ మధ్యలో తిన్న చిన్నచిన్న చిరుతిండ్లు, అదనపు ముక్కలు లేదా వారాంతంలో ఎక్కువగా తిన్న విషయాలు మర్చిపోతారు. దీంతో తాము అన్ని సరిగ్గా చేస్తున్నామని భావించినప్పటికీ వాస్తవానికి అవసరమైన కేలరీ లోటు (క్యాలరీ డెఫిసిట్) ఏర్పడదు.
బయటి ఫుడ్ తినడం..
నాలుగో కారణం తరచూ బయట ఆహారం తినడం. రెస్టారెంట్లో తయారుచేసే వంటకాలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా రుచిని పెంచేలా తయారవుతాయి. అందుకే వాటిలో ఎక్కువ నూనె, వెన్న, క్రీమ్, చక్కెర వంటి అధిక కేలరీల పదార్థాలు ఉంటాయి. దాల్, గ్రిల్ లేదా టిక్కా వంటి ఆరోగ్యకరంగా కనిపించే వంటకాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ కేలరీలు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల బయట ఆహారం ఎక్కువగా తినడం వల్ల తెలియకుండానే రోజువారీ కేలరీల పరిమాణం పెరిగిపోతుంది. బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం లేదా ఆహార నియంత్రణ మాత్రమే కాకుండా నిద్ర, కేలరీల కచ్చితమైన లెక్కలు, బయట ఆహారంపై నియంత్రణ వంటి అంశాలపైనా సమానంగా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న మార్పులు చేస్తే బరువు తగ్గే ప్రక్రియ మళ్లీ వేగం అందుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

