‘వ్యక్తిగత వ్యాపారాలతో ఆర్ధికాభివృద్ధి సాధించాలి’
స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి వ్యాపారులు ప్రారంభించి ఆర్ధికాభివృద్ధి సాధించాలని సెర్ప్ భద్రాద్రి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సమ్మక్క అన్నారు. గురువారం కరకగూడెం మండల కేంద్రంలోని...
– సెర్ప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సమ్మక్క
కరకగూడెం, నవంబర్ 19 : స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి వ్యాపారులు ప్రారంభించి ఆర్ధికాభివృద్ధి సాధించాలని సెర్ప్ భద్రాద్రి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సమ్మక్క అన్నారు. గురువారం కరకగూడెం మండల కేంద్రంలోని స్వయం శక్తి మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సమాఖ్య సహాయకులు, వీవోఎలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మట్లాడారు. కుటుంబాల్లో పేదరికాన్ని తగ్గించేందుకు మహిళ స్వయం ఉపాధి మార్గాలను అనుసరించాలన్నారు. మండలంలోని 27 గ్రామ సమాఖ్యల పరిధిలో 270 వ్యక్తిగత ఎంటర్ ప్రైజెస్ వ్యాపారులు స్థాపించడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులు ఈ నెలాఖరు వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రుణాలు మంజూరు చేయించుకోవాలని సూచించారు. అనంతరం వ్యక్తిగత ఎంటర్ ప్రైజెస్ స్థాపనకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే విధానం, ఆన్లైన్ దరఖాస్తుల తయారీపై జిల్లా రిసోర్స్ పర్సన్ బండ్ల మధు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ మండల ఏపీఏం బండి వినోద్ క్రాంతి, శ్రీనిధి ఆర్ఎమ్ వెంకన్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, సీసీ సత్యనారాయణ, వీవోఏలు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వ్యక్తిగత వ్యాపారాలతో ఆర్ధికాభివృద్ధి సాధించాలి’
Kondagattu | కొండగట్టులో చందనోత్సవాల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్
అడ్డుకట్ట వేయకపోతే సింగరేణి కాలనీల్లో పచ్చదనం కనుమరుగు!
‘నేటికి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయం’
KTR | కాంగ్రేసోళ్లే ఒక్కొక్కరుగా అన్నీ బయటపెడుతున్నరు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

