Health Tips : ఫిట్నెస్ ప్రియులు సహా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేవారు షుగర్ జోలికి వెళ్లేందుకు భయపడుతుంటారు. చక్కెర అధికంగా తీసుకుంటే మధుమేహ ముప్పుతో పాటు బరువు పెరగడం, హృద్రోగాల బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే అసలు షుగర్ అధికంగా తీసుకుంటే హృద్రోగ ముప్పుతో పాటు త్వరగా వయసు మీరే లక్షణాలు, చర్మ సమస్యలు తలెత్తుతాయి.
షుగర్ అధికంగా ఉండే పదార్ధాలు తీసుకుంటే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. ఇక రోజుకు ఎంత చక్కెర తీసుకుంటే మేలనే విషయానికి వస్తే మనం రోజువారీ తీసుకునే ఆహార పదార్ధాల్లో పురుషులైతే రోజుకు 38 గ్రాములు మించకుండా షుగర్ తీసుకోవచ్చు. స్త్రీలు రోజుకు 25 గ్రాములు మించకుండా చక్కెర తీసుకోరాదని న్యూట్రిషనిస్ట్ మామి అగర్వాల్ ఇన్స్టాగ్రాం వీడియోలో తెలిపారు.
ఇక అధిక షుగర్‌ను తీసుకోవడం నివారించాలంటే షుగరీ స్నాక్స్‌కు దూరంగా ఉండటంతో పాటు ప్రాసెస్డ్ షుగర్‌కు ప్రత్యామ్నాయంగా అవసరమైతే సహజసిద్ధమైన పండ్లు, డార్క్ చాక్లెట్స్‌ను తీసుకోవాలి. బెర్రీస్, ఫ్రూట్స్‌తో కలిపి యోగర్ట్ తీసుకోచవ్చు. స్వీట్స్ తినాలనిపించేవారు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్ సలాడ్, డ్రై ఫ్రూట్స్, స్వీట్ పొటాటో వాటిని ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read More :
Maha Shivaratri | శివరాత్రి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి?