న్యూఢిల్లీ : సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చని వైద్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొవ్వుతో కూడిన ఆహారం తగ్గించడంతో పాటు అవసరమైన దాని కంటే తక్కువ ఆహారం తీసుకుంటే శరీరానికి మేలు కంటే హాని అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహారం కొవ్వులను కరిగించి జీవక్రియల రేటును మెరుగుపరిచేలా ఉండాలి.
శరీరంలో రక్తం చక్కెర నిల్వలను మెయింటైన్ చేస్తూ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు ఊతమిచ్చేలా మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని సమర్ధంగా నిర్వహించేలా ఆహారం ఉంటేనే అది కొవ్వును కరిగించేందుకు దారితీస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్ క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరగడంతో పాటు ఎన్నో శారీరక ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యకరంమైన ఆహారంతో పాటు తేలికపాటి డిన్నర్ తీసుకోవాలని, రాత్రి నిద్రించేందుకు రెండు గంటల ముందు ఆహారం తీసుకుని ఆపై కొద్దిసమయం వాకింగ్ చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇక అధిక బరువును తగ్గించి ఆరోగ్యకరమైన శరీరాకృతి కోసం ఈ ఆహార పదార్ధాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బ్లాక్ పెప్పర్
అల్లం, వెల్లుల్లి
పసుపు
కొబ్బరి నూనె
తృణధాన్యాలు
బాదం, జీడిపప్పు
ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉండే పదార్ధాలు
పెరుగు, ప్రొబయాటిక్స్‌తో కూడిన ఆహారం