న్యూఢిల్లీ : ఆరోగ్యానికి బుల్లెట్స్ వంటి మిల్లెట్స్ (Millets) పోషకాల గనిగా పేరొందాయి. తృణధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా రాబట్టాలంటే వీటిని నిర్ధిష్ట పద్ధతుల్లో తీసుకోవడం మేలు. ఆరోగ్యకరమైన, సమతులాహారంగా మిల్లెట్స్‌ను తీసుకునే క్రమంలో కొన్ని పాటించాల్సినవి, చేయకూడనివి తెలసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జల వంటి మిల్లెట్స్‌లో ఒక్కో వెరైటీలో శరీరానికి అవసరమైన ఒక్కో రకమైన విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అన్ని వెరైటీలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రాసెస్ చేసిన మిల్లెట్స్ కంటే సహజమైన తృణధాన్యాలనే తీసుకోవాలి.
వీటిలో పుష్కలంగా లభించే మినరల్స్, విటమిన్లు, ఫైబర్ మనకు మేలు చేస్తాయి. బలవర్ధకమైన మిల్లెట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని అతిగా తినడం అనర్ధమే. అరకప్పు మిల్లెట్స్ మనకు అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తాయి. ఇక మిల్లెట్స్‌ను నేరుగా కాకుండా వాటిని వండేందుకు కొద్ది గంటల ముందు నీటిలో నానబెట్టాలి. మిల్లెట్స్‌తో పాటు పప్పుధాన్యాలు, బీన్స్ వంటి ప్రొటీన్స్తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.
Read More :