Eating Disorder | ఉదయం నిద్ర లేచింది మొదలు మనకు ఆకలేయడం సర్వసాధారణం. టిఫిన్ అని, మధ్యాహ్న భోజనం అని, సాయంత్రం స్నాక్స్ అని, రాత్రి భోజనం అని.. ఇలా ఎన్నో రకాల ఆహారాలను లాగించేస్తుంటాం. ఆహారాలు మనకు ఆరోగ్యంతో పాటు శక్తిని ఇస్తుంటాయి. అయితే, మనలో చాలా మంది లావెక్కిపోతున్నామనే భావనలో ఉండి తినే ఆహారాల్లో కోత విధిస్తుంటారు. దాంతో శరీరానికి కావాల్సినంత మేర పోషకాలు, విటమిన్లు అందక ఈటింగ్ డిజార్డర్స్ సమస్యలు వస్తుంటాయి.
అనోరెక్సియా నెర్వోసా.. దీన్నే సాధారణ భాషలో ఆకలి లేని మానసిక వ్యాధిగా వైద్యులు చెప్తుంటారు. తమ శరీరం ఎంత చక్కటి ఆకృతి కలిగిఉన్నప్పటికీ లావుగా ఉన్నామని భావిస్తూ తినే తిండిలో కోత పెడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు తమకు ఎంతో ఆకలిగా ఉన్నప్పటికీ, కడుపు మాడిపోతున్నప్పటికీ.. ఆకలి లేదంటూనే ఉంటారు. ఏమీ తినడానికి ఇష్టపడరు. భోజనం మానేస్తుంటారు. ఆకలి మందగించే సందర్భాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అందక బరువు విపరీతంగా తగ్గిపోతుంది.
ఈ వ్యాధి లక్షణాలిలా ఉంటాయి..
ఇవీ గమనించదగిన లక్షణాలు..
ఆకలి మందగించిన వారు మెల్లిగా ఒంటరి వారుగా మారి అందరికీ దూరంగా వుంటారు. స్నేహితులు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపరు. చాలా చాలా రహస్యంగా ఉండడానికి అలవాటు పడతారు. ఇలాంటి వారిని ఇతర కుటుంబసభ్యులు వదిలేయకుండా వారిని మానసికంగా దృఢపరిచేలా సాయపడాలి. మానసిక ఆరోగ్య నిపుణుల మద్దతు తీసుకుని వారిని మామూలు మనిషిగా తీర్చిదిద్దాలి. మానసిక చికిత్సతోపాటు ఆహార నిపుణుల సలహాలను తప్పకుండా పాటించాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.