మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి.
Eating Disorder | శరీరం సరైన ఆకృతిలో ఉన్నప్పటికీ లావెక్కిపోతున్నామనే భావనలో ఉండి తినే ఆహారాలపై కోత విధిస్తుంటారు. పదే పదే తమ బరువుపై మదనపడుతుంటారు. ఇది ముమ్మాటికీ మానసిక వ్యాధిగా పరిగణించి చికిత్స అందించాలి.