Breast Cancer | క్యాన్సర్లు ప్రస్తుతం చాలా సహజమైపోయాయి. మహిళల్లో వివిధ క్యాన్సర్లు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకునే క్యాన్సర్.. బ్రెస్ట్ క్యాన్సర్. మన దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 13 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. అయితే, ప్రస్తుతం ఎన్నో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో ఎంతో మంది క్యాన్సర్ల నుంచి కోలుకుంటున్నారు.
రొమ్ములో క్యాన్సర్ కణితులను గుర్తించడానికి మమోగ్రామ్ పరీక్ష చేస్తారు. కొన్ని సార్లు దీని ద్వారా కూడా కణితులను గుర్తించడం అసాధ్యమవుతుంది. అందుకని 40 ఏండ్ల వయసు దాటిన ప్రతీ మహిళ.. ముఖ్యంగా తల్లి కావాలనుకుంటున్న వారు, గర్భిణీలు ఎవరికి వారు తమ రొమ్ముల్లో మార్పులను గుర్తించాలి. అనుమానం రాగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బ్రెస్ట్ భాగంలో ఏదైనా గట్టిగా తగిలినా, నొప్పిగా అనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలిసి చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్ బారి నుంచి బయటపడొచ్చు.

రొమ్ముల్లో పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్ గ్రంథుల ద్వారా, చనుమొనకు పాలను తీసుకెళ్లే నాళాల ద్వారా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. బ్రెస్ట్‌లోని కొవ్వు కణజాలం ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశమున్నది. శోషరస కణుపులపై దాడి చేసిన తర్వాత ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదమున్నది. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స అందించే వీలుంటుందని వైద్యులు చెప్తున్నారు.
సాధారణ సంకేతాలు
చికిత్స
ఎంఆర్ఐ, పీఈటీ/సీటీ స్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ గైడెడ్ బ్రెస్ట్ బయాప్సీ, మామోగ్రామ్, బోన్ స్కాన్ వంటి పరీక్షల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్లను గుర్తిస్తారు. కీమోథెరపీ ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. అయినప్పటికీ సర్జరీ, బయాలాజికల్, హోర్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ ద్వారా కూడా రొమ్ము క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు.
గర్భిణీల్లో..
గర్భధారణ సమయంలో లేదా డెలివరీ తర్వాత ఏడాది లోపు రొమ్ము క్యాన్సర్‌ను ‘గర్భధారణ సంబంధ రొమ్ము క్యాన్సర్’ గా పిలుస్తారు. గర్భిణీల్లో క్యాన్సర్ చికిత్స కణితి దశపై ఆధారపడి ఉంటుంది. గర్భంలోపల ఉన్న పిండంపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉన్నందున రేడియేషన్ థెరపీని సూచించరు. పిండం మూడు నెలల సమయంలో కీమోథెరపీ, సర్జరీ చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.
గర్భిణీల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారించినట్లయితే తల్లిపాలు కూడా ప్రభావితమవుతాయి. చనుపాలిచ్చే సమయంలో కీమోథెరపీ, హార్మోన్ థెరపీకి రికమెండ్ చేయరు. వీటి నుంచి వచ్చే స్రవాలు తల్లిపాలలో కలిస్తే శిశువుకు సురక్షితం కాదు. ఈ నేపథ్యంలో తల్లిపాలు ఇవ్వకుండా జాగ్రత్తపడాలని వైద్యులు సూచిస్తుంటారు. తొలిసారి తల్లి అవుతున్నవారిలో గర్భధారణ సంబంధ రొమ్ము క్యాన్సర్ సంకేతాలు కనిపించడం సర్వసాధారణం. కుటుంబంలోని వ్యక్తులు రొమ్ము, అండాశయ క్యాన్సర్ బారినపడినట్లయితే, ఆ కుటుంబంలోని యువతులు తప్పనిసరిగా జన్యు పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.