Health Tips : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నది. అయితే భోజన సమయాల మధ్య విరామంలో నిర్ధిష్ట పానీయాలను తీసుకోవడం ద్వారా జీవక్రియల వేగం పెరిగి, ఆకలి తగ్గించడంతో పాటు హైడ్రేషన్ లెవెల్స్ సరిగ్గా మెయింటెన్ చేసేందుకు ఉపకరిస్తుంది. ఈ డ్రింక్స్‌తో బరువు తగ్గే ప్రక్రియ కూడా సులభతరమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుసరిస్తూనే ఈ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. జీవక్రియలు వేగం పుంజుకునేందుకు తగినంత నీరు తీసుకోవడం తప్పనిసరి. నీరు అధికంగా తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటంతో అతిగా తినేందుకు మొగ్గుచూపరు. ఇక కెటచిన్స్, కేఫిన్ వంటి మెటబాలిజం ప్రేరేపించి, కొవ్వును కరిగించే పదార్ధాలు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ శరీరానికి మేలు చేస్తుంది.
మీల్స్ మధ్య గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇక బ్లాక్ కాఫీ షుగర్, క్రీమ్ లేకుండా తీసుకుంటే తక్కువ క్యాలరీలు, కేఫిన్ అధికంగా ఉండటం వల్ల మెటబాలిజం మెరుగై బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. తక్షణ శక్తినిచ్చే కొబ్బరి నీళ్లు కూడా బరువు తగ్గేందుకు, మెటబాలిజం వేగం పుంజుకునేందుకు ఉపకరిస్తాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనుసరించే సమయంలో తీసుకోవాల్సిన పానీయాల విషయానికి వస్తే..
వాటర్
గ్రీన్ టీ
బ్లాక్ కాఫీ
వాటర్ సైడర్ వినిగర్ వాటర్
హెర్బల్ టీ
ఎలక్ట్రోలైట్ వాటర్
కొబ్బరి నీరు
లెమన్ వాటర్
Read More :
Darshan | మారని దర్శన్ తీరు.. మీడియా ముఖంగా అసభ్య ప్రవర్తన..!