Darshan | బెంగళూరు పోలీసులు రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) అతడి స్నేహితురాలు నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని అరెస్ట్ చేయగా.. వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిసిందే. కొన్ని నెలలుగా దర్శన్ అండ్ టీం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో నిందితులపై ఛార్జీషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. తాను రేణుకాస్వామిపై దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించినట్టు ఇప్పటికే వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో దర్శన్ చేసిన దారుణ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముఖంగా దర్శన్ ప్రవర్తనా శైలి హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల బందోబస్తు మధ్య జైలులోకి వెళ్తున్న దర్శన్ మీడియాను చూడగానే.. తన చేతి మిడిల్ ఫింగర్ చూపిస్తూ కనిపించాడు. అసభ్యకర ప్రవర్తన చూసిన అభిమానులు, నెటిజన్లు దర్శన్ ఫ్రస్టేషన్ మూడ్‌లో ఉన్నాడంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.
దర్శన్ జైలు శిక్షననుభవిస్తున్నప్పటికీ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోవడం కన్నడ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికే బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు విచారణ ఖైదీగా ఉన్న దర్శన్‌కు రాచ మర్యాదలు అందుతున్నట్టు ఆరోపణలు రాగా.. అతడిని బళ్లారి జైలుకు (Ballari jail) అయినప్పటికీ దర్శన్ తీరు మారకపోవడం గమనార్హం.
తన స్నేహితురాలు పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్ అండ్ టీం దారుణంగా హత్య చేసిందని తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు.
Darshan sees media, holds out middle finger: ದರ್ಶನ್ ದುರಹಂಕಾರದ ಪರಮಾವಧಿ ನೋಡಿ..
.
.
.
WATCH #RepublicKannada LIVE: https://t.co/EjLcVNHWsb
.
.
.#darshan #badgesture #ballarijail #darshaninjail #darshangang #darshanraval #darshanravaldz #darshanthoogudeepa #darshaners #darshantv… pic.twitter.com/DOnvEuPdb8— Republic Kannada (@KannadaRepublic) September 12, 2024
Pawan Kalyan | జెట్టీ యాక్టర్ కృష్ణకు పవన్ కల్యాణ్ ప్రశంసలు.. కారణమిదే.. !
Bad Newz | తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూజ్ను ఇక ఉచితంగా చూసేయొచ్చు.. ప్లాట్‌ఫాం ఇదే
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?