Herbal Teas | అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టతరమో అందరికీ తెలిసిందే. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు తీసుకునే ఆహారంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రించాలి. వేళకు భోజనం చేయాలి. ఇలా అన్ని రకాల సూత్రాలను పాటిస్తేనే అధిక బరువును తగ్గించుకోగలుగుతారు. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే దీంతోపాటు కొన్ని రకాల హెర్బల్ టీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు. ఈ హెర్బల్ టీలను సేవించడం వల్ల చాలా త్వరగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇక ఆ హెర్బల్ టీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో మనకు అనేక రకాల హెర్బల్ టీ పొడులు లభిస్తాయి. వాటిల్లో వైట్ టీ కూడా ఒకటి. ఈ టీని రోజుకు ఒక కప్పు సేవిస్తే చాలు, కొవ్వు మంచు ముద్దలా కరిగిపోతుంది. ఈ టీని తాగడం వల్ల కొవ్వు కణాలు కరిగిపోతాయి. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. అలాగే చైనా ప్రజలు ఎక్కువగా తాగే ఊలాంగ్ అనే టీని సేవించడం వల్ల కూడా కొవ్వు కరుగుతుంది. ఈ టీని తాగితే కొవ్వు ఆక్సీకరణ ప్రక్రియ త్వరగా జరుగుతుంది. దీంతో బరువు త్వరగా తగ్గుతారు.
అధిక బరువును తగ్గించుకునేందుకు పెప్పర్మింట్ టీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టీని తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఆకలి నియంత్రణలోకి వస్తుంది. ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. రూయిబోస్ అనే టీ రకంలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. కనుక ఈ టీని కూడా తరచూ సేవిస్తుండాలి.
అధిక బరువును తగ్గించడంలో అల్లం టీ కూడా ఎంతో పనిచేస్తుంది. అల్లాన్ని నీటిలో వేసి మరిగించి డికాషన్‌లా తయారు చేసి తాగుతుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇందులో థర్మోజెనిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఎంతటి మొండి కొవ్వును అయినా ఈ టీతో కరిగించుకోవచ్చు.
మార్కెట్లో మనకు మచా టీ కూడా లభిస్తుంది. ఇది ఆకుపచ్చ రంగులో ఆకుకూర జ్యూస్‌లా ఉంటుంది. కనుక దీన్ని తాగేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ఈ టీలోనూ అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కనుక దీన్ని కూడా తాగవచ్చు. దీన్ని తాగితే కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఇలా పలు రకాల హెర్బల్ టీలను తరచూ సేవిస్తుండడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ టీల వల్ల పలు పోషకాలు కూడా లభిస్తాయి కనుక వీటిని తాగితే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.