న్యూఢిల్లీ : ఆరోగ్యం మెరుగుపడేందుకు, జీవన శైలి వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు సమతులాహారం తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణలు (Health Tips) సూచిస్తున్నారు. నూతన ఏడాదిలో మీ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకునేందుకు ఇదే సరైన సమయం. ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవడం న్యూ ఇయర్ రిజల్యూషన్‌గా ఎంచుకోవచ్చు.
మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాహార నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. రోజువారీ ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు, ప్రొటీన్స్, పప్పు ధాన్యాలు, ఆరోగ్యకర కొవ్వులు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అత్యవసర పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఆహారం ద్వారా సమకూరుతాయి.
అయితే ఏది తీసుకున్నా మితాహారంతో పాటు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్నే తీసుకోవాలని, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక మెరుగైన ఆరోగ్యం కోసం ఈ సూచనలు పాటించాలని పేర్కొంటున్నారు.
సమతులాహారం
మితాహారం
తగినంత నీరు తీసుకోవాలి
మొక్కల ఆధారిత ప్రొటీన్స్
తీపి పదార్ధాలకు చెక్
ఆరోగ్యకర కొవ్వులు
మనసుపెట్టి తినడం
సోడియం వాడకం తగ్గించాలి
Read More :