Healthy Gut : ఆధునిక జీవనశైలితో మనలో చాలా మంది మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ప్రేవుల ఆరోగ్యం పదిలంగా కాపాడుకుంటే ఈ సమస్యలను అధిగమించవచ్చు. దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లతో ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా సులభమైన మార్గాలను సూచిస్తున్నారు.
రాత్రివేళ నాలుగైదు కిస్మిస్లను నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకుంటే అందులో ఉండే ఫైబర్, సహజమైన చక్కెరలు జీర్ణక్రియ సాఫాగా సాగేలా చేస్తాయని ప్రేవుల కదలికలను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఇక ప్రతిరోజూ నిర్ణీత సమయంలో భోజనం ముగించేలా చూసుకోవాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకోవడం ద్వారా ప్రేవుల ఆరోగ్యం మెరుగవుతుంది.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడంతో పాటు ఫైబర్ తగినంతగా అందేలా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గ్లాస్లో ఒక టీస్పూన్ చియా సీడ్స్‌తో కూడిన వాటర్‌ను తీసుకోవడం మేలు. చియా గింజల్లో అధిక ఫైబర్‌తో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా అవిసె గింజలు, పండ్లు, కూరగాయలు, తగినంత నీరు, ప్రొ బయాటిక్ ఫుడ్స్, రాత్రి వేళ నెయ్యి, పాలుతో పాటు పడుకునే ముందు అంజీరా పండ్లు తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్‌తో మలబద్ధకం నివారించవచ్చు.
Read More :
Apple Company: ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ యూజర్లకు కేంద్రం వార్నింగ్