ముంబై : టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ విజయపరంపర కొనసాగుతున్నది. గ్రూపు-సీ పోరులో భాగంగా ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన కీలక పోరులో విండీస్ 30 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్(42 బంతుల్లో 76 నాటౌట్, 2ఫోర్లు, 7సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్(1), షాయ్ హోప్(0) ఘోరంగా విఫలం కాగా, మిడిలార్డర్లో రూథర్‌ఫర్డ్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టు పోరాడే స్కోరు అందుకుంది.
ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ రూథర్‌ఫర్డ్ తన ఇన్నింగ్స్‌లో ఏడు భారీ సిక్స్‌లు బాదాడు. ఒవర్టన్(2/33), రషీద్(2/16) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 19 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. సామ్ కరన్(43 నాటౌట్) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. గుడకేశ్ మోతీ(3/33), రోస్టన్ చేస్(2/29) ఇంగ్లండ్ పతనంలో కీలకమయ్యారు. జట్టుకు భారీ స్కోరు అందించిన రూథర్‌ఫర్డ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.