Apple Company: ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్ యూజర్లకు కేంద్రం వార్నింగ్
Apple Company: ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌బుక్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో కోడ్ సమస్య ఉత్పన్నమైనట్లు సీఈఆర్టీ వెల్లడించింది. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్లో సమస్యలు వచ్చినట్లు గుర్తించారు.
న్యూఢిల్లీ: భారత సెక్యూర్టీ అడ్వైజరీ సంస్థ సీఈఆర్టీ-ఇన్ కొత్త వార్నింగ్ జారీ చేసింది. యూపిల్(Apple Company) కంపెనీకి చెందిన ఐఫోన్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లతో హై రిస్క్ ఉన్నట్లు వార్నింగ్‌లో తెలిపింది. యాపిల్ ఉత్పత్తులకు చెందిన రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉన్నట్లు సీఈఆర్టీ పేర్కొన్నది. యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌తో పాటు యాపిల్ సఫారీ వర్షన్ 17.4.1, యాపిల్ మ్యాక్ ఓఎస్ వెంచురూ వర్షన్ 13.6.6, యాపిల్ మ్యాక్ సొనోమా వర్షన్ 14.4.1, యాపిల్ వర్షన్ 1.1.1, ఐఓఎస్ 17.4.1, ఐప్యాడ్ వర్షన్ 16.7.7 వర్షన్ల కంటే ముందు వర్షన్లలో సమస్యలు వస్తున్నట్లు కేంద్రం తన వార్నింగ్‌లో తెలిపింది.
ఫోన్లు హ్యాకింగ్‌కు గురికాకుండా ఉండేందుకు సీఈఆర్టీ పలు కీలక ముందు జాగ్రత్త సూచనలు చేసింది. యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్, మాక్ ఓఎస్, విజన్ ఓఎస్ డివైస్‌లలో లేటెస్ట్ వర్షన్స్ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సెక్యూర్టీ లేని వై-ఫై నెట్‌వర్క్‌లకు కనెక్ట్ కావద్దు అని అడ్వైజరీ సూచించారు. అదనపు భద్రత కోసం 2ఎఫ్ఏ ను అమలు చేసుకోవాలని తెలిపారు. యాప్‌లను నమ్మకమైన సోర్స్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL Player Trade | డీల్ డన్.. పాండ్యా, అర్ష్‌దీప్ ట్రేడింగ్‌కు ఆమోదం.. మళ్లీ రోహిత్‌కే ఎంఐ పగ్గాలు?
Ambulance Shortage | కొడంగల్ క్రిటికల్ కేర్..ట్రాక్టరే అంబులెన్స్ రేవంత్ ఇలాకాలో ఘటన
Srisailam Reservoir | శ్రీశైలంలో నీళ్లున్నా.. రైతులకు కన్నీళ్లేనా? ఇంకా 25 టీఎంసీలు వాడుకోవచ్చు
Unemployment Crisis | నిరుద్యోగ భారత్..! ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీని మరిచిన బీజేపీ
Nirmal | నిర్మల్‌లో జనసునామీ దద్దరిల్లిన రైతుగర్జన సభ.. కేటీఆర్ ప్రసంగంతో అందరిలో ఉత్సాహం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

