రోజుకు కేవలం రెండు ఖర్జూర పండ్లను తినడం వల్ల.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఖర్జూరంలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఖనిజాలు, ఫైబర్, పాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.