Health Tips : క్యాలరీలు తక్కువగా ఉండేందుకు డైట్ సోడాల్లో అస్పర్టేమ్, సుక్రలోజ్ వంటి కృత్రిమ స్వీటెనర్లను వాడుతుంటారు. కార్బొనేటెడ్ బెవరేజెస్ అయిన డైట్ సోడాలు రెగ్యులర్ సోడాల కంటే మంచివని చెబుతున్నా వీటిని తరచూ తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుంది. డైట్ సోడాలను క్రమం తప్పకుండా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు వెంటాడతాయని తాజా పరిశోధన హెచ్చరించింది.
క్యాలరీల వినియోగాన్ని నియంత్రించే శరీర సహజ సామర్ధ్యాన్ని కృత్రిమ స్వీటెనర్లు దెబ్బతీస్తాయి. ప్రేవుల్లో బ్యాక్టీరియను మార్చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఏమార్చేస్తాయి. డైట్ సోడాలో ఉండే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లతో ఆకలి పెరిగి తీపి పదార్ధాలను అధికంగా తీసుకునేలా ప్రేరేపిస్తాయి. దీంతో శరీర బరువు పెరిగే ప్రమాదం ఉంది. డైట్ సోడాలకు ప్రత్యామ్నాయంగా మంచినీరు, హెర్బల్ టీలు, సహజమైన ఫ్లేవర్డ్ వాటర్ తీసుకుంటే మేలు. మరోవైపు డైట్ సోడాలతో టైప్ 2 డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇక డైట్ సోడాలతో ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో పరిశీలిస్తే..
ఊబకాయం
మధుమేహ ముప్పు
హృద్రోగ ముప్పు
కిడ్నీ దెబ్బతినే అవకాశం
ఎముకల బలహీనం
దంత సమస్యలు
జీర్ణ సమస్యలు
Read More :
Road Damage | గోషామహల్లో కుంగిన రోడ్డు..బోల్తా పడిన డీసీఎం : వీడియో